ఆసిఫాబాద్, వెలుగు: పది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల మద్దతుతో గురువారం నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మె (భారత్ బంద్)కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆసిఫాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక సంస్కరణలు, కొత్త లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను బలహీనపరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగ భద్రతను తగ్గించి, యజమానులకు ఎక్కువ స్వేచ్ఛ కల్పించడం ద్వారా కార్మికుల జీవనోపాధిపై ప్రభావం చూపుతుందన్నారు. కార్మికులు, రైతుల న్యాయం, గౌరవం కోసం జరుగుతున్న ఈ ప్రజాస్వామ్య పోరాటంలో జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సంఘీభావంగా తెలపాలని, పార్టీ మండల అధ్యక్షులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
