కోటి రూపాయల పెట్టుబడి.. రూ. 6 కోట్ల లాభం : వాడు చెప్పాడు ఈమె నమ్మింది.. చివరికి ఇలా..!

కోటి రూపాయల పెట్టుబడి.. రూ. 6 కోట్ల లాభం : వాడు చెప్పాడు ఈమె నమ్మింది.. చివరికి ఇలా..!

ఆన్​లైన్ ఇన్వెస్ట్​మెంట్  పేరుతో సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. ట్రేడింగ్‌‌, షేర్ మార్కెట్‌‌, తక్కువ టైమ్​లో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేస్తున్నారు. లేటెస్ట్ గా ఇన్వెస్ట్ మెంట్  పేరుతో  ఓ మహిళ నుంచి  కోటి రూపాయలు కాజేసిన ఆరుగురు  సైబర్ నేరగాళ్లను ఆగస్టు 22న   హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఎన్ఎస్ఈ , Coin SSDCX పేరుతో సోషల్ మీడియా ద్వారా మోసం చేస్తోంది ఈ ముఠా.

 హైదరాబాద్ లో  34 ఏళ్ల మహిళ నుంచి రూ.1.05 కోట్లు కాజేశారు ఈ కేటుగాళ్లు.  ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వలలో పడేశారు. యాప్‌లో  రూ. 6.05 కోట్లు లాభమని చూపించి మోసం చేశారు.  ఏటీఎం  కార్డులు, మ్యూల్ అకౌంట్ల ద్వారా డబ్బు చలామణి చేశారు. 50కి పైగా బ్యాంక్ అకౌంట్లలో నిధులు తిప్పి పెట్టింది గ్యాంగ్. డబ్బు చైనాకు చెందిన చెన్ చెన్‌కి బిట్‌కాయిన్ రూపంలో పంపించారు. నిందితుల నుంచి 15 డెబిట్ కార్డులు, 8 మొబైల్స్, స్కానర్, ఫింగర్ ప్రింట్ మెషిన్ సీజ్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.  ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ల పేరుతో జరుగుతోన్న మోసాల పట్ట జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు

6 నెలల్లో 681 కోట్లు

ఈ ఏడాది 6 నెలల్లోనే 8,866 మంది ఆన్‌‌లైన్ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ మోసాల బారినపడ్డారు. వీరి వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు రూ.170.65 కోట్లు కొట్టేశారు. సైబర్ సేఫ్టీపై పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా.. కొందరు అత్యాశకు పోయి, మరికొందరు అవగాహన లేక డబ్బులు కోల్పోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజు సగటున 310కి పైగా ఫిర్యాదులు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అందుతున్నాయి. వీళ్లు యావరేజ్​గా సుమారు రూ.4 కోట్ల వరకు కోల్పోతున్నారు. ఈ ఏడాది మొదటి 6 నెలల వ్యవధిలో 55,773 ఫిర్యాదులు అందగా.. 41,172 కేసుల్లో బాధితులు రూ.681 కోట్లు కోల్పోయారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 10.67 లక్షల ఫిర్యాదులు నేషనల్ సైబర్ క్రైమ్‌‌ రిపోర్టింగ్‌‌ పోర్టల్‌‌ ద్వారా అందాయి. వీటిలో రూ.9,591.41 కోట్లు సైబర్ నేరగాళ్లు దోచేశారు. కాగా, రాష్ట్రంలో నమోదైన 189 కేసుల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తు చేసింది. రూ.92 కోట్లు కొల్లగొట్టిన 228 మంది సైబర్ క్రిమినల్స్‌‌ను అరెస్ట్‌‌ చేసింది. వీరికి దేశవ్యాప్తంగా నమోదైన 1,313 నేరాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించింది.