
ఏపీ నిర్మించాలనుకుంటున్న మరో నాలుగు ఇంట్రా లింక్ (రాష్ట్రం లోపల నదుల అనుసంధానం) ప్రాజెక్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, బాబు జగ్జీవన్రామ్ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వైఎస్ఆర్ పల్నాడు డ్రాట్మిటిగేషన్ ప్రాజెక్ట్, గుండ్రేవుల రిజర్వాయర్లను ఇంట్రా లింక్కింద చేపట్టేందుకు కేంద్రం సహకరించాలని ఏపీ కాన్సెప్ట్ నోట్స్ సబ్మిట్ చేసిందని పేర్కొంది.ఆ ప్రాజెక్టులన్నీ కృష్ణా, గోదావరి ట్రిబ్యునల్అవార్డులు, విభజనచట్టంలోని నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.అయినా, పరిగణనలోకి తీసుకుని డీపీఆర్‌లు ఇవ్వాలని ఎలా అడిగారని ప్రశ్నించింది.
ఇలాంటి ప్రాజెక్టులను సెంట్రల్వాటర్ కమిషన్ కూడా పరిగణనలోకి తీసుకోలేదని, కొన్ని ప్రాజెక్టులను అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో 2021లో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్లో చేర్చించిందని గుర్తు చేసింది. ఈ ఇంట్రా లింక్ ప్రాజెక్టులు కేంద్రం నేషనల్పర్స్పెక్టివ్ ప్లాన్(ఎన్పీపీ)లో భాగంగా తీసుకున్న ఏ లింక్‌లోనూ భాగం కాదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఇలాంటి ప్రాజెక్టులపై సీడబ్ల్యూసీ అభ్యంతరాలు వ్యక్తం చేసిందని.. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌లో భాగంగా 200 టీఎంసీల వరద జలాలను తరలించేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలపైనా అన్ని ఏజెన్సీలు అభ్యంతరం తెలిపాయని, అది గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని చెప్పాయని గుర్తుచేసింది.
అవి గోదావరి నీళ్లు కాదు..హిమాలయ జలాలు: ఎన్‌డబ్ల్యూడీఏ
గోదావరి కావేరి లింక్‌లో తరలిస్తున్న నీళ్లు గోదావరి జలాలు కాదని ఎన్‌డబ్ల్యూడీఏ చైర్మన్ స్పష్టం చేశారు. నదుల అనుసంధానంలో భాగంగా హిమాలయ పర్వతాల్లోని నదుల నీటిని ఇక్కడకు తీసుకొస్తామని చెప్పారు. అయితే, ఫేజ్ 1లో ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి గోదావరి నీళ్లను తీసుకెళ్తామని, భవిష్యత్‌లో ఇంటర్ లింకింగ్ ద్వారా హిమాలయ జలాలను ఇక్కడకు తీసుకొస్తామని పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్ అభ్యంతరాలనూ ఆయన పరిగణనలోకి తీసుకున్నారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ చత్తీస్‌గఢ్ నీళ్లను ముట్టుకోబోమన్నారు. అయితే, బోధ్‌ఘాట్ ప్రాజెక్టును నిర్మించేందుకు కనీసం 15 ఏండ్లైనా పడుతుందని, అప్పటి వరకు జీసీ లింక్‌లో తాత్కాలికంగా మాత్రమే చత్తీస్‌గఢ్ నీటిని వాడుకుంటామని స్పష్టం చేశారు. చత్తీస్‌గఢ్ బోధ్‌ఘాట్ ప్రాజెక్టును పూర్తి చేస్తే.. జీసీ లింక్‌ను మూసేస్తామన్నారు. అప్పుడు హిమాలయాల నుంచి నీటిని ఇచ్చంపల్లి వరకు తరలిస్తామని పేర్కొన్నారు. గోదావరిలో ఒక్క చుక్క కూడా వాడుకోబోమని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలూ పెద్దమనసు చేసుకుని ప్రస్తుతానికి జీసీ లింక్‌కు సమ్మతం తెలపాలని విజ్ఞప్తి చేశారు.
మేం ప్రాజెక్ట్ కడితే నీళ్లు ఎక్కడుంటయ్?: చత్తీస్‌గఢ్
జీసీ లింక్‌పై చత్తీస్‌గఢ్ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రం వాడుకోని నీళ్ల ఆధారంగానే లింక్ చేపడుతున్నందున.. నీటి వినియోగంపై క్లారిటీ ఇచ్చింది. తమకు 301 టీఎంసీల వాటా ఉన్నదని, అందులో ఇప్పటికే 164 టీఎంసీల వినియోగం ఉందని పేర్కొంది. మిగిలింది 137 టీఎంసీలని పేర్కొంది. అందులోనూ వంద టీఎంసీలతో బోధ్‌ఘాట్ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని, అలాంటప్పుడు నీటి లభ్యత ఎలా ఉంటుందని ప్రశ్నించింది.
అలాగే, పరీవాహక ప్రాంతం ఆధారంగా తమకు 45 టీఎంసీల నీళ్లివ్వాలని కర్నాటక డిమాండ్ చేసింది. కనీసం 40 టీఎంసీలైనా కేటాయించాలని కోరింది. కాగా, గోదావరి అత్యధిక భాగం మహారాష్ట్రలోనే ప్రవహిస్తున్నదని, 45 శాతం పరీవాహక ప్రాంతం ఇక్కడే ఉందని ఆ రాష్ట్రం పేర్కొంది. అలాంటి తమకు ఒక్క చుక్క కూడా నీళ్లు ఇవ్వకుండా బయటకూర్చోబెట్టేశారని ఆక్షేపించింది. జీసీ లింక్‌లో నీళ్లు ఇవ్వకపోయినా.. తమకు కొన్ని ఇంట్రా లింక్స్ఉన్నాయని, వాటిని జీసీ లింక్‌లో భాగంగా నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేసింది.