
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ కడియం కావ్య విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్ హైవే (ఎన్‌హెచ్)- 163 సర్వీస్ రోడ్లను పూర్తి చేయాలని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని వరంగల్ ఎంపీ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. శుక్రవా రం ఢిల్లీలో గడ్కరీని ఆమె మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యాదాద్రి, -వరంగల్ నేషనల్ హైవే 163 (హైదరాబాద్- భూపాలపట్నం రోడ్)లో పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. నేషనల్ హైవేను 4 లైన్లుగా విస్తరించినప్పటికీ, కొన్ని గ్రామాల వద్ద సర్వీస్ రోడ్లు అనుసంధానం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
నిడిగొండ, రఘునాథ పల్లి, చాగల్, స్టేషన్ ఘనపూర్, చిన్నపెండ్యాల్, కరుణాపురం గ్రామాల వద్ద రోడ్లు ఉన్నా, జనగామ నుంచి ఈ గ్రామాల మధ్యలో లింకులు లేకపోవడం సమస్యగా మారిందని చెప్పారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కావ్య వెల్లడించారు.