
వాడి వయస్సు 14 ఏళ్లు.. చదువుతుంది 10వ తరగతి.. పేరెంట్స్ చెబితే వినాలి.. చెప్పింది చేయాలి.. వీడి వయస్సుకు ఇదే.. ఇలాంటోడు పెద్ద క్రిమినల్ అయ్యాడు.. క్రిమినల్ పని చేయటమే కాదు.. అది ఎలా చేయాలో ముందుగానే స్క్రిప్ట్ రాసుకున్నాడు.. ఫస్ట్ దొంగతనం ఎలా చేయాలి.. అక్కడి నుంచి ఎవరికీ దొరకకుండా ఎలా బయపడాలి.. దొంగతనం సమయంలో ఎవరైనా చూస్తే.. అడ్డొస్తే ఏం చేయాలి.. ఆధారాలు దొరకకుండా ఇంటిని గ్యాస్ లీక్ చేసి పేల్చేయాలి.
ఇలా పక్కాగా ఇంగ్లీష్‌లో స్క్రిప్ట్ రాసుకున్నాడు.. అనుకున్నట్లుగానే దొంగతనానికి వెళ్లాడు.. తన దొంగతనం చూసిన.. అడ్డగించిన 12 ఏళ్ల బాలికను.. తన వెంట తెచ్చుకున్న కత్తితో.. తాను రాసుకున్న స్ర్రిప్ట్ ప్రకారం చంపేశాడు.. ఏంటీ సినిమా స్టోరీ అనుకుంటున్నారా.. కానేకాదు.. నాలుగు రోజులుగా మిస్టరీగా మారిన కూకట్ పల్లిలోని 12 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసులోని రియల్ స్టోరీ ఇదీ.. పోలీసులకే సవాల్‌గా మారిన ఈ కేసులో వీడిన చిక్కుముడితో.. మరో ఊహించని.. ఊహించలేని.. భయంకరమైన క్రైం స్టోరీ బయటపడటం అనేది ఇప్పుడు మరో సంచలనంగా మారింది.
ALSO READ : సహస్రను చంపింది 10వ తరగతి అబ్బాయి
మిషన్ థెఫ్ట్ పేరుతో ప్లాన్ ఇలా రెడీ చేసుకున్నాడు.
- స్టెప్ 1 : దొంగతనం చేసే ఇంటికి వెళ్లాలి.
- స్టెప్ 2 : ఇంటికి తాళం వేసి ఉంటే.. ఆ తాళాన్ని పగలగొట్టాలి.
- స్టెప్ 3 : ఇంట్లో ఉండే హుండీని ఎలా పగలగొట్టాలి.. డబ్బులు ఎలా తీసుకోవాలి..
- స్టెప్ 4 : దొంగతనం తర్వాత ఇంట్లో నుంచి ఎలా పారిపోవాలి.
- స్టెప్ 5 : దొంగతనానికి వెళ్లే ముందే భద్రత కోసం.. సేఫ్టీ కోసం వెంట కత్తి తీసుకెళ్లాలి.
- స్టెప్ 6 : కటింగ్ విత్ నైఫ్.. గ్యాస్ సిలిండర్ లీక్
- దొంగతనం ఎలా చేయాలి.. ఎవరికీ తెలియకుండా ఎలా పారిపోవాలి అని ముందుగా ప్లాన్ చేసుకుని.. అందుకు తగ్గట్టుగా స్క్రిప్ట్ గా రాసుకున్నాడు ఈ బాలుడు. దొంగతనం చేసిన తర్వాత ఎవరికీ డౌట్ రాకుండా ఉండేందుకు బాలిక ఇంట్లో గ్యాస్ లీక్ చేసి వెళ్లిపోవాలనుకున్నాడు
- సరిగ్గా అనుకున్నది అనుకున్నట్లుగానే సహస్ర ఇంటికి వచ్చి దొంగతనం చేశాడు ఈ బాలుడు..
- ఇంట్లోని 80 వేల రూపాయలు తీసుకుని పారిపోతుండగా.. ఇంట్లో ఉన్న బాలిక సహస్ర చూసింది.
- ఇక్కడే ఆ బాలుడు తన ప్లాన్ బి అమలు చేశాడు.
- బాలిక సహస్రపై దాడి చేశాడు. బలవంతంగా గొంతు పిసికి చంపాడు.
- ఆ తర్వాత చనిపోయిందా లేదా అనే అనుమానంతో.. తన వెంట తెచ్చుకున్న కత్తితో సహస్ర గొంతు కోశాడు.. అప్పటికీ బతుకుతుంది ఏమో అనే భయంతో శరీరంపై ఇష్టమొచ్చినట్లు 20 కత్తిపోట్లు పొడిచాడు.
- సహస్ర ఫ్యామిలీ నివాసం ఉంటుంది అపార్ట్ మెంట్ కు సీసీ కెమెరాలు లేకపోవటంతో ఈ బాలుడు ఇంటికి వచ్చింది.. వెళ్లింది ఎవరూ చూడలేదు..
- పోలీస్ కస్టడీలో ఉన్న ఈ బాలుడి నుంచి కత్తి, బట్టలు అన్నీ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.