కేక్ తినిపించిన చేతితోనే పొడిచి చంపాడు: సహస్ర మర్డర్ కేసులో వెలుగులోకి భయంకర విషయాలు

కేక్ తినిపించిన చేతితోనే పొడిచి చంపాడు: సహస్ర మర్డర్ కేసులో వెలుగులోకి భయంకర విషయాలు

హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం కూకట్‎పల్లిలో దారుణ హత్యకు గురైన పన్నేండేళ్ల బాలిక సహస్ర మర్డర్ కేసు మిస్టరీ వీడింది. పన్నేండేళ్ల సహస్రను వాళ్ల ఇంటి పక్కనే ఉండే పదో తరగతి చదువుతోన్న బాలుడు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సహస్ర ఫ్యామిలీ ఉంటోన్న అపార్ట్మెంట్‎లో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ కేసును సాల్వ్ చేయడం పోలీసులకు సవాల్‎గా మారింది.

సహస్రను అత్యంత కిరాతంగా హత్య చేసిన దుండగుడు ఎవరో తేల్చేందుకు పోలీసులు అపార్ట్మెంట్లో ఉంటున్న వారితో పాటు అనుమానితులను విచారించారు. ఈ క్రమంలో సహస్ర ఫ్యామిలీ ఉండే అపార్ట్మెంట్‎లోనే ఉంటున్న ఓ సాఫ్ట్‎వేర్ ఇచ్చిన సమాచారంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. సహస్ర హత్య జరిగిన రోజు ఓ బాలుడు దాదాపు 15 నిమిషాలు తమ పక్కింట్లో దాక్కున్నట్లు సదరు సాఫ్ట్ వేర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 

దీంతో ఆ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు బాలుడి ఇంట్లో సోదాలు చేశారు. తనిఖీల్లో పోలీసులకే కళ్లు బైర్లు కమ్మే విషయాలు బయటపడ్డాయి. సహస్ర ఇంట్లో ఎలా దొంగనతం చేయాలి.. దొంగతనం చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి.. ఒకవేళ దొరికిపోతే ఏం చేయాలనే ముందుగానే బాలుడు స్ర్కిప్ట్ రాసుకున్న స్క్రిప్ పేపర్ పోలీసులకు దొరికింది. దీని ఆధారంగా సహస్రను హత్య చేసింది ఆ బాలుడే అని పోలీసులు నిర్ధారించారు. సదరు బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

సహస్రను హత్య చేసిన బాలునిది ఆంధ్రప్రదేశ్‎లోని ఒంగోలు జిల్లా. రెండేళ్ల క్రితం సహస్ర ఇంటి పక్కన భవనంలోకి వచ్చారు బాలుడి ఫ్యామిలీ. సహస్ర కుటుంబ సభ్యులతో బాలుడు ఫ్యామిలీకి పరిచయం ఉంది. సహస్ర పుట్టినరోజు నాడు బాలికకు కేక్ కూడా తినిపించాడు నిందితుడు. సహస్రకు నిందితుడు కేక్ తినిపించిన ఫొటో ప్రస్తుతం వైరల్‎గా మారింది.  

ఇలా సహస్ర ఫ్యామిలీ గురించి మొత్తం వివరాలు తెలియడంతో వాళ్ల ఇంట్లో చోరీ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకు ముందే పక్కా ప్లాన్ వేసుకుని.. స్ర్కిప్ట్‎ను ఒక పేపర్ పై రాసుకున్నాడు. ఫస్ట్ ఇంట్లోకి ఎలా వెళ్లాలి.. చోరీ ఎలా చేయాలి.. దొంగతనం చేసిన తర్వాత ఎలా బయటపడాలి.. ఒకవేళ చోరీ చేస్తూ దొరికిపోతే ఎలా తప్పించుకోవాలి అని మొత్తం ముందే ప్లాన్ చేసుకున్నాడు. 

►ALSO READ | స్కెచ్ వేసి.. స్క్రిప్ట్ రాసి.. టెన్త్ క్లాసులోనే ఇంత క్రిమినల్ బ్రెయినా : సహస్ర కేసులో ఊహించని క్రైం కథ

స్కెచ్ ప్రకారం వెళ్లాడు.. దొంగతనం చేశాడు. కానీ అప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న సహస్ర దొంగతనం చేయడం చూసి అడ్డుకుంది. సహస్ర చూడటంతో తన చోరీ విషయం ఎక్కడ బయటపడుతుందోనని బాలుడు బయపడ్డాడు. దీంతో థెఫ్ట్ ప్లాన్‎ను కాస్తా మర్డర్ ప్లాన్‎గా మార్చాడు. ప్లాన్ బీలో భాగంగా ముందుగా సహస్ర గొంతు నులిమి చంపాడు.

చనిపోయిందో లేదో అనే అనుమానంతో వెంట తీసుకుపోయిన కత్తితో సహస్ర గొంతు కోశాడు. అయినప్పటికీ చనిపోయిందో లేదో అనే భయంతో కత్తితో విచక్షణరహితంగా సహస్రపై దాడి చేసి పారిపోయాడు. ఒకవేళ సహస్ర దొంగతనాన్ని అడ్డుకోకుంటే చోరీ అనంతరం ఇంట్లో గ్యాస్ లీక్ చేసి బ్లాస్ట్ చేసి పారిపోవాలని స్కెచ్ వేశాడు బాలుడు. 

కానీ సహస్ర చూడటంతో ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది. చోరీ ప్లాన్ కాస్తా.. హత్యకు దారి తీసింది. 10వ తరగతి చదువుతోన్న బాలుడి ఇంతా క్రూరంగా ఒక హత్య చేశాడని తెలియడంతో స్థానికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యారు. బాలుడే సహస్రను అంతమొందించాడని తెలియడంతో.. ఆమె పుట్టిన రోజు నిందితుడు కేక్ తినిపించినా ఫొటో చూసి.. కేక్ తినిపించినా చేతులతోనే దారుణంగా పొడిచి చంపాడని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.