కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళను రెండో పెళ్లి చేసుకున్న సీఐ...

కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళను రెండో పెళ్లి చేసుకున్న సీఐ...

ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఓ సీఐ ఆగడాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.. కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనపై మహిళ భర్త పోలీసులను ఆశ్రయించినప్పటికీ పట్టించుకోకపోవడంతో హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి.. పీఎంఓను ఆశ్రయించాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. మదనపల్లి పట్టణంలోని సొసైటీ కాలనీకి చెందిన పవన్ కుమార్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కలికిరి చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు పవన్.

పెళ్లైన కొంతకాలానికే పవన్ దంపతులకు గొడవలు మొదలయ్యాయి.. దీంతో  మదనపల్లె డీఎస్పీ ఆఫీసును ఆశ్రయించింది మహిళ. ఈ క్రమంలో మహిళతో పరిచయం పెంచుకున్నాడు సీఐ సురేష్... ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న పవన్ పోలీసులను ఆశ్రయించి హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి పీఎంఓను ఆశ్రయించాడు బాధితుడు. సీఐపై చర్యలు తీసుకోవాలని పీఎంఓను కోరాడు బాధితుడు.

ALSO READ : స్కెచ్ వేసి.. స్క్రిప్ట్ రాసి..

ఈ క్రమంలో సీఐ సురేష్ పై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ సమాచారం ఇచ్చింది పీఎంఓ. అధికారుల ఆదేశాలతో  ఈ ఏడాది జూన్ నెలలో సీఐపై కేసు నమోదు చేశారు పోలీసులు.సురేష్ కుమార్ తల్లిదండ్రులు కులాంతర వివాహం కావడంతో తల్లి కులం రిజర్వేషన్ తో ఉద్యోగం పొందాడని ఫిర్యాదులో పేర్కొన్న బాధితుడు .కడప జిల్లా సింహాద్రిపురంకు చెందిన సురేష్ కుమార్ పై రెవెన్యూ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నంద్యాల సిసిఎస్ లో విధులు నిర్వహిస్తున్న సిఐ సురేష్ కుమార్ సెలవు పై వెళ్లినట్లు సమాచారం.