వెహికల్స్ నడిపేటప్పుడు పల్స్ రేట్ తగ్గినా హెచ్చరించే గ్లోవ్స్

వెహికల్స్ నడిపేటప్పుడు పల్స్ రేట్ తగ్గినా హెచ్చరించే గ్లోవ్స్
  • బీపీ పెరిగితే అలర్ట్ చేస్తది!
  • స్మార్ట్‌‌ గ్లోవ్స్‌‌ తయారు చేసిన సర్కార్ స్కూల్ స్టూడెంట్ సఫియా బేగం 
  • నేషనల్ సైన్స్ ఫెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రాజెక్టు ఎంపిక  
  • వెహికల్స్ నడిపేటప్పుడు పల్స్ రేట్ తగ్గినా హెచ్చరిస్తది

సికింద్రాబాద్, వెలుగు:   ఓ వ్యక్తి ట్రక్కు నడుపుతున్నాడు. సడెన్ గా హార్ట్ బీట్ తగ్గి పల్స్ రేట్ పడిపోయింది. తెలియకుండానే ట్రక్కును డివైడర్ కు ఢీకొట్టాడు. హార్ట్ బీట్ బాగా పడిపోవడం, వెంటనే ట్రీట్ మెంట్ అందకపోవడంతో చివరకు అతని ఊపిరి ఆగిపోయింది. ఈ సంఘటన అతని చుట్టాల ఫ్యామిలీలోని ఓ బాలికను కలచివేసింది. ఇలాంటి మరణం ఇంకెవ్వరికీ రాకూడదని, అందుకోసం ఏదైనా డివైస్ కనిపెట్టాలని నిర్ణయించుకుంది. ఆ అమ్మాయి ఆలోచనను సైన్స్ టీచర్ ఎంకరేజ్ చేసింది. దీంతో వెహికల్స్ నడుపుతుండగా బీపీ పెరిగితే వెంటనే అలర్ట్ చేసే ఓ స్మార్ట్‌‌ గ్లోవ్స్‌‌ను ఆ అమ్మాయి తయారు చేసింది. సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి గవర్నమెంట్ స్కూల్ లో నైన్త్ క్లాస్ చదువుతున్న సఫియా బేగం రూపొందించిన ఈ స్మార్ట్‌‌ గ్లోవ్స్‌‌కు స్టేట్ లెవల్ అవార్డు దక్కింది. దీనిని మరింత అభివృద్ధి చేసి, నేషనల్ లెవల్ సైన్స్ ఫెయిర్‌‌కు పంపేందుకు సఫియా సిద్ధమవుతోంది.

ఇలా పనిచేస్తయ్

ఈ స్మార్ట్‌‌ గ్లోవ్స్‌‌కు రెండువైపులా సెన్సర్లు ఉంటాయి. వీటిని చేతులకు తొడుక్కుని వాహనం నడుపుతున్నప్పుడు డ్రైవర్​బాడీలో బీపీ పెరిగినా, గుండె పల్స్​ రేటు తగ్గినా వెంటనే  గుర్తిస్తాయి.  సెన్సర్ల వద్ద ఉండే లైట్లు వెలుగుతూ అలర్ట్ చేస్తాయి. దీంతో డ్రైవర్ అలర్ట్ అయి వెహికల్ ను ఆపితే యాక్సిడెంట్ ముప్పు తప్పుతుంది. అలాగే వెంటనే డాక్టర్ ను సంప్రదించి, ట్రీట్ మెంట్ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్మార్ట్ గ్లోవ్స్‌‌ నుంచి లైటింగ్ అలర్ట్ మాత్రమే వస్తుంది. డ్రైవర్ బీపీ లేదా పల్స్ రేట్ లో తేడాలు వస్తే.. ఫ్యామిలీ మెంబర్లకు  మెసేజ్ అలర్ట్ లు కూడా వెళ్లేలా దీనిని అభివృద్ధి చేస్తున్నారు.  ఈ స్మార్ట్ గ్లోవ్స్‌‌ తయారీకి కావాల్సిన వస్తువులను కోఠిలో కొనుక్కున్నామని, మొత్తం రూ. 2 వేలలోపే ఖర్చయిందని సఫియా బేగం చెప్పింది.

స్టేట్ లెవల్ లో బెస్ట్..

లాక్ డౌన్ టైంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఆన్ లైన్ సైన్స్ ఫెయిర్ ను నిర్వహించాయి. ఈ సందర్భంగా తన సైన్స్ టీచర్ పద్మజ సహాయంతో స్మార్ట్‌‌ గ్లోవ్స్‌‌ను తయారు చేసిన సఫియా బేగం.. ఆ ప్రాజెక్టు వివరాలను అప్ లోడ్ చేసింది. సైన్స్ ఫేర్ కు హైదరాబాద్ నుంచి12 ప్రాజెక్టులు వెళ్లగా, వాటిలో స్మార్ట్‌‌ గ్లోవ్స్‌‌ రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. నేషనల్ లెవల్ లో జరిగే ‘ఇన్ స్పైర్ మేళా’కు కూడా సెలెక్ట్ అయింది.

స్టూడెంట్లను ఎంకరేజ్ చేస్తున్నాం

స్టూడెంట్లలో క్రియేటివిటీని బయటకు తీసి, వారిని ఎంకరేజ్ చేయడమే మా పని. స్మార్ట్‌‌ గ్లోవ్స్‌‌ను ఇంకా మాడిఫై చేసి, నేషనల్ సైన్స్ ఫేర్ లో చూపించాలని అనుకుంటున్నాం. సరైన టెక్నాలజీ అందుబాటులో లేకపోయినా, ఉన్న సోర్సెస్ ఆధారంగానే నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం.

– పద్మజ, సైన్స్ టీచర్, గవర్నమెంట్ స్కూల్, సీతాఫల్ మండి 

చౌకగా తయారుచేసి అందిస్తా..

మా అమ్మ తరపు బంధువు ఒకరికి ట్రక్కు నడుపుతుండగా పల్స్ రేట్ పెరిగిపోవడంతో తనకు తెలియకుండానే డివైడర్‌‌ను ఢీకొట్టి చనిపోయారు. ఇంకెవరికీ ఇలా కాకూడదని మా టీచర్ సాయంతో స్మార్ట్ గ్లౌజ్ ను రూపొందించి, సైన్స్ ఫేర్ కు పంపాను. స్టేట్ లెవల్ అవార్డు రావడంతో పాటు నేషనల్ సైన్స్ ఫేర్ కూ మా ప్రాజెక్ట్ సెలక్ట్ కావడం సంతోషంగా ఉంది. నేషనల్ సైన్స్ ఫేర్ తర్వాత దీనిని తక్కువ ఖర్చుతోనే తయారు చేసి, అవసరమైన వారికి అందిస్తా.

– సఫియా బేగం, నైన్త్ క్లాస్, గవర్నమెంట్ స్కూల్, సీతాఫల్ మండి

For More News..

మమత ఈగో వల్ల రైతులు నష్టపోయారు

‘చక్కాజామ్‌’తో మూడు రాష్ట్రాల్లో బండ్లు కదల్లే..

ప్రగతిభవన్‌కు పోనీయరు.. బీఆర్కే భవన్‌కు రానీయరు