సెంట్రల్ జైలులో కరోనా కలకలం.. ప్రొఫెసర్ సాయిబాబాకు పాజిటివ్

సెంట్రల్ జైలులో కరోనా కలకలం.. ప్రొఫెసర్ సాయిబాబాకు పాజిటివ్

వ్యాక్సినేషన్‌ ప్రక్రియతో కరోనా వైరస్ దేశంలో తగ్గుతున్న సమయంలో నాగ్పూర్‌ సెంట్రల్ జైలులో మరోసారి  కరోనా కలకలం రేగింది. మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సహా మరో నలుగురు కరోనా బారిన పడ్డారు. సాయిబాబాకు శుక్రవారం కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందనీ, సిటీ స్కాన్ ఇతర పరీక్షల కోసం తీసుకెళ్లనున్నట్లు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అనుప్‌ కుమార్‌ కుమ్రే తెలిపారు. అలాగే చికిత్స కోసం ఆయనను ప్రభుత్వ మెడికల్ కాలేజీకి కానీ ఆస్పత్రికి తరలించాలా అనేది డాక్టర్లు నిర్ణయిస్తారని చెప్పారు. దీంతో 90 శాతం అంగవైకల్యం, ఇప్పటికే జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా ఆరోగ్యంపై తీవ్ర అందోళన వ్యక్తమవుతోంది.

నిషేధిత మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై యుఏపీఏ చట్టం కింద ప్రొఫెసర్ సాయిబాబాకు నాగ్ పూర్ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో  2017 మార్చి నుంచి సాయిబాబా నాగ‌పూర్‌  జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.