పోలీసులకు కరోనా ట్రీట్మెంట్ అవసరం లేదా?

పోలీసులకు కరోనా ట్రీట్మెంట్ అవసరం లేదా?

రాష్ట్రంలో క‌రోనా టెస్టులు నిర్వహించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బీజేపీ నేతలు.. సోమ‌వారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న ప్రధాన డిమాండ్ తో వారు ధ‌ర్నాలు చేశారు. అంతేకాకుండా కరోనా వైద్యం అందిస్తున్న ఆసుపత్రుల్లో ఇబ్బందులపై, అలాగే వైద్యుల సమస్యలపై కూడా బీజేపీ నేతలు పలు డిమాండ్లు చేశారు .ఈ క్ర‌మంలో కోఠిలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద నిరసనకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అనంత‌రం బండి సంజ‌య్ మాట్లాడుతూ..”పోలీస్ ఎంపానెల్డ్ ఆసుపత్రుల్లో పోలీసులకు కరోనా చికిత్స అందిస్తున్నట్లు సమాచారం అందింది, కాబట్టి పోలీసులకు ఆ ఆసుపత్రుల్లో చికిత్స అందించకూడదని ఈ నెల 8 వ తేదీన టీఆర్ఎస్ సర్కార్ ప్ర‌త్యేక జీవో జారీ చేసింది. జీవో ఇచ్చి మరీ పోలీసులకు చికిత్సను నిరాకరించడం ఏంటీ ? ఇంత దుర్మార్గమా? కోవిద్ ను ముందువరుసలో ఎదుర్కొంటున్నటివంటి పోలీసులంటే అంత నిర్లక్ష్యమా? ఎవరైనా చికిత్స చేయమని జీవో లు ఇస్తారు కానీ, చికిత్సను నిరాకరించమని జీవో జారీ చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది” అని అన్నారు.