కేజ్రీవాల్ పై గోవా సీఎం ఆగ్రహం

కేజ్రీవాల్ పై గోవా సీఎం ఆగ్రహం

ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు గోవా సీఎం ప్రమోద్ సావంత్. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేజ్రీవాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు అమానవీయమని..కశ్మీర్ లోయలో జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కొన్న ప్రజలను అవమానించడమేనని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ సెషల్ లో కేజ్రీవాల్ మాట్లాడుతూ కశ్మీర్ ఫైల్స్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారాయి. ఈ సినిమాను పన్ను రహితం చేయాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారని..దీన్ని ఎందుకు పన్ను రహితం చేయాలనుకుంటున్నారు? కమలనాథులకు అంత ఆసక్తి ఉంటే యూట్యూబ్ లో పెట్టమని వివేక్ అగ్ని హోత్రికి చెప్పాలని సూచించారు. అలా చేయడం వల్ల అందరూ ఫ్రీగా కశ్మీర్ ఫైల్స్ సినిమాను చేస్తారని చెప్పారు.  

మరిన్ని వార్తల కోసం

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు

RRR రివ్యూ: ఎవ్వరూ తగ్గలే!