
వివాదాస్పద కామెంట్లు, ట్వీట్లతో వార్తల్లో ఉండే కాంట్రవర్శియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. ఆనాడు జూలియస్ సీజర్ ను బ్రూటస్, ఎన్టీఆర్ ను నాదెండ్ల భాస్కర రావు , నారా చంద్రబాబు నాయుడు వెన్ను పోటు పొడిచినట్టే ఈసారి పవన్ కల్యాణ్ ను నాదెండ్ల మనోహర్, చంద్రబాబు నాయుడు కలిసి వెన్నుపోటు పొడుస్తారని తనకు రాత్రి కలలో దేవుడు చెప్పాడని ట్వీట్ చేశాడు. ప్రియమైన జనసైనికులారా దయచేసి మన లీడర్ని, వెన్నుపోటు నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు నాదెండ్ల మనోహర్ కు దూరంగా ఉండమని చెప్పండని సూచించారు. ఇంతకు ముందు పవనిజం బుక్ రాసిన రాజు రవితేజ గురించి ఇలాగే వార్నింగ్ ఇచ్చానని, ఆ మాటే నిజమైందని అన్నారు. పవన్ కల్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, నాదెండ్ల భాస్కర్ రావు, నాదెండ్ల మనోహర్ రావు, జనసేన హ్యాష్ ట్యాగ్ లు జత చేస్తూ రాంగోపాల్ వర్మ ఈ ట్వీట్ చేశారు.