బనకచర్లపై వారంలో వివరణ ఇవ్వండి..ఏపీకి గోదావరి బోర్డు లేఖ

బనకచర్లపై వారంలో వివరణ ఇవ్వండి..ఏపీకి గోదావరి బోర్డు లేఖ

హైదరాబాద్, వెలుగు: పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై గోదావరి రివర్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు కూడా మరోసారి అభ్యంతరం తెలిపింది. ప్రాజెక్ట్ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీకి ఇటీవల ఏపీ టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ఏపీ దూకుడుపై అభ్యంతరం తెలుపుతూ ఇటు ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అంజద్ హుస్సేన్ కేంద్రానికి లేఖ రాశారు. 

దీంతో రెండ్రోజుల క్రితం కృష్ణా బోర్డు.. ప్రాజెక్ట్ వాస్తవ పరిస్థితి తెలియజేయాలంటూ ఏపీకి లేఖ రాసింది. తాజాగా, గోదావరి బోర్డు కూడా కృష్ణా బోర్డు బాటలోనే నడిచింది. వారంలోగా బనకచర్ల ప్రాజెక్ట్ వాస్తవ పరిస్థితి ఏంటో వారం రోజుల్లో తెలియజేయాలని ఏపీని ఆదేశించింది.