
నిర్మల్ జిల్లా: బాసరలో గోదావరి హారతి పూజలు ఘనంగా నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరిలో నీటిమట్టం పెరిగి పుష్కరఘాట్ లోని శివలింగాల వరకు నీళ్లు చేరుకున్నాయి. దీంతో వేకువజామున శ్రీవేద నిత్యానందగిరి స్వామి ఆధ్వర్యంలో గోదావరి పూజలు చేశారు. పవిత్ర గోదావరికి నిత్య హారతి పూజలు చేయడం వల్ల ప్రజలు సుఖ: శాంతులతో ఉంటారని నిత్యానందగిరి స్వామి తెలిపారు. వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు.