Kapil Dev: జడేజా, స్టోక్స్‌లలో ఎవరు బెస్ట్ ఆల్ రౌండర్..? కపిల్ దేవ్ సమాధానమిదే!

Kapil Dev: జడేజా, స్టోక్స్‌లలో ఎవరు బెస్ట్ ఆల్ రౌండర్..? కపిల్ దేవ్ సమాధానమిదే!

టీమిండియా స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్.. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రస్తుత క్రికెట్ లో  వరల్డ్ బెస్ట్ ఆల్ రౌండర్స్. వీరిద్దరూ బ్యాటింగ్ లో బౌలింగ్ లో తమ తమ జట్లకు కీలక ప్లేయర్. దశాబ్ధాకాలంగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. జడేజా టెస్టుల్లో మూడేళ్ళుగా టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు. స్టోక్స్ తన ఆల్ రౌండ్ షో తో ఇప్పటికే ప్రపంచానికి తానేంటో నిరూపించాడు. అయితే వీరిద్దరిలో ఎవరు బెస్ట్ ఆల్ రౌండర్ అనే విషయాన్ని టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. 

ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (PGTI) ఈవెంట్‌లో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. జడేజా, స్టోక్స్ లను పోల్చడం సరికాదు. స్టోక్స్ గొప్ప ఆల్ రౌండర్. కానీ జడేజా అంతకంటే మెరుగైన ఆల్ రౌండర్. స్టోక్స్ కంటే జడేజానే కొంచెం ముందు ఉంటాడు". అని కపిల్ దేవ్ తన మనసులోని మాట చెప్పాడు. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో స్టోక్స్, జడేజా అద్భుతంగా రాణించారు. ఈ సందర్భంగా ఎవరు బెస్ట్ ఆల్ రౌండర్ అనే ప్రస్తావన వచ్చింది. ఈ మ్యాచ్ మొత్తంలో స్టోక్స్ 6 వికెట్లు తీసుకోవడంతో పాటు తొలి ఇన్నింగ్స్ లో 141 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మరోవైపు జడేజా 4 వికెట్లు తీయడంతో పాటు రెండు ఇన్నింగ్స్ ల్లో 127 పరుగులు చేసి సత్తా చాటాడు.   

►ALSO READ | Gautam Gambhir: నీకు అన్యాయం చేసే వ్యక్తిని కాను.. అభిమన్యు ఈశ్వరన్‌కు గంభీర్ ఓదార్పు మాటలు

ఈ సందర్భంగా బుమ్రా గురించి.. టెస్ట్ కెప్టెన్ గిల్ గురించి కపిల్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. "వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నప్పటికీ జస్ప్రీత్ బుమ్రా జాతీయ జట్టుకు ఇంత బాగా రాణించిన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది". అని అన్నాడు. గిల్ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ.. గిల్ కు కొంచెం సమయం కావాలి. ఇది అతని మొదటి సిరీస్. చాలా ఓపిగ్గా ఉండాలి. తప్పులు చేసినా  కాలక్రమేణా చాలా నేర్చుకుంటాడు". అని కపిల్ అన్నారు.