
తెలంగాణలో భారీ వర్షాలు కురస్తున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం (ఆగస్టు 08) ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అయితే ఈ రాత్రి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆరెంజ్ అలర్ట్:
పెద్దపల్లి, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో గంటకు 40కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారి.
యెల్లో అలర్ట్:
కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, హన్మకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, భూపాలపల్లి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
►ALSO READ | రాఖీ పండగకు ఊరెళ్తున్నారా.. హైదరాబాద్లో వర్షం స్టార్ట్.. ఈ ఏరియాల్లో వెళ్లే వాళ్లు జగ్రత్త !
రాత్రి ఒంటి గంట వరకు వర్షాలు కురుసే అవకాశం ఉన్నందున రైతులు పొలాల వద్దకు వెళ్లవద్దని సూచించారు. రాత్రుల్లో మోటార్లు వేయకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉండటంతో పొలాలకు వెళ్లకుండా ఇళ్లల్లోనే ఉండాల్సిందిగా సూచించారు.