
Gold Price Today: వారం రోజులుగా నిరంతరం పెరుగుతూనే ఉన్న పసిడి ధరలు సామాన్యులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. అమెరికా ఊహించని స్థాయిలో టారిఫ్స్ ప్రకటించటం.. ప్రధానంగా సేఫ్ హెవెన్ పసిడికి రెక్కలు ఇచ్చాయి. దీంతో రాఖీ పండుగ రోజున శనివారం రేట్లు తగ్గటంతో చాలా మంది తమ షాపింగ్ చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. కానీ స్థానిక మార్కెట్లలో రేట్లను పరిశీలించటం కూడా ముఖ్యం.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.2వేల 500 తగ్గింపును చూసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ రేట్లను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 445, ముంబైలో రూ.9వేల 445, దిల్లీలో రూ.9వేల 460, కలకత్తాలో రూ.9వేల 445, బెంగళూరులో రూ.9వేల 445, కేరళలో రూ.9వేల 445, పూణేలో రూ.9వేల 445, వడోదరలో రూ.9వేల 450, జైపూరులో రూ.9వేల 460, మంగళూరులో రూ.9వేల 445, మైసూరులో రూ.9వేల 445, అయోధ్యలో రూ.9వేల 460, నోయిడాలో రూ.9వేల 460, గురుగ్రాములో రూ.9వేల 460 వద్ద విక్రయించబడుతున్నాయి.
ALSO READ : Gold Rate: శ్రావణ శుక్రవారం భారీగా పెరిగిన గోల్డ్..
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.2వేల 700 తగ్గింపును చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10వేల 304, ముంబైలో రూ.10వేల 304, దిల్లీలో రూ.10వేల 319, కలకత్తాలో రూ.10వేల 304, బెంగళూరులో రూ.10వేల 304, కేరళలో రూ.10వేల 304, పూణేలో రూ.10వేల 304, వడోదరలో రూ.10వేల 309, జైపూరులో రూ.10వేల 319, మంగళూరులో రూ.10వేల 304, మైసూరులో రూ.10వేల 304, అయోధ్యలో రూ.10వేల 319, నోయిడాలో రూ.10వేల 319, గురుగ్రాములో రూ.10వేల 319గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.94వేల 450 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 3వేల 040గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 27వేల వద్ద ఉంది.