
Gold Price Today: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాలు పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో ఆర్థిక ఒడిదుడుకుల దృష్ట్యా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి ప్రణాళికలను కొంత మార్చుకోవటం బంగారం, వెండి ధరలకు రెక్కలు తెచ్చింది. గడచిన వారం రోజులుగా వరుసగా పెరుగుతూనే ఉన్న పసిడి ధరలు.. నేడు భారీగా ఎగబాకాయి. శ్రావణ శుక్రవారం రోజున షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.7వేల భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 470, ముంబైలో రూ.9వేల 470, దిల్లీలో రూ.9వేల 485, కలకత్తాలో రూ.9వేల 470, బెంగళూరులో రూ.9వేల 470, కేరళలో రూ.9వేల 470, పూణేలో రూ.9వేల 470, వడోదరంలో రూ.9వేల 475, అహ్మదాబాదులో రూ.9వేల 475, జైపూరులో రూ.9వేల 485, లక్నోలో రూ.9వేల 485, మంగళూరులో రూ.9వేల 470, నాశిక్ లో రూ.9వేల 473, మైసూరులో రూ.9వేల 470, అయోధ్యలో రూ.9వేల 485, బళ్లారిలో రూ.9వేల 470, నోయిడాలో రూ.9వేల 485, గురుగ్రాములో రూ.9వేల 485 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.7వేల 600 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ రేట్లను గమనిస్తే.. చెన్నైలో రూ.10వేల 331, ముంబైలో రూ.10వేల 331, దిల్లీలో రూ.10వేల 346, కలకత్తాలో రూ.10వేల 331, బెంగళూరులో రూ.10వేల 331, కేరళలో రూ.10వేల 331, పూణేలో రూ.10వేల 331, వడోదరంలో రూ.10వేల 336, అహ్మదాబాదులో రూ.10వేల 336, జైపూరులో రూ.10వేల 346, లక్నోలో రూ.10వేల 346, మంగళూరులో రూ.10వేల 331, నాశిక్ లో రూ.10వేల 334, మైసూరులో రూ.10వేల 331, అయోధ్యలో రూ.10వేల 346, బళ్లారిలో రూ.10వేల 331, నోయిడాలో రూ.10వేల 346, గురుగ్రాములో రూ.10వేల 346గా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.94వేల 700 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 3వేల 310గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 27వేల వద్ద ఉంది.