
Warren Buffett: ప్రపంచ సంపన్నుల్లో ఫేమస్ వ్యక్తి అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్. ఆయన పెట్టుబడి చిట్కాలకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారంటేనే తెలుస్తోంది ఆయనకు ఉన్న క్రేజ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం.. ఎంత సంపాదించినా ఆడంభరాలకు పోకుండా అవసరమైన మేరకే ఖర్చు చేసే ఆయన ఎల్లప్పుడూ స్పెషలే. ఆచరణలో డబ్బు విలువను తన ప్రవర్తనతో చూపించటంలో ఆయనకు మించిన బిలియనీర్ లేడని చెప్పుకోవచ్చు.
పెట్టుబడుల ప్రపంచంలో ముఖ్యం సరైన స్టాక్స్ ఎంపిక చేసుకోవటమే. అందుకే స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో వారెన్ బఫెట్ ఒక తిరుగులేని రారాజు అని చెబుతుంటారు నిపుణులు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 140 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.12 లక్షల కోట్లు. అయితే ఇంత ఆస్థి కలిగిన బఫెట్ ఒక్క రూపాయి కూడా బంగారంలో పెట్టుబడిని కలిగి ఉండకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకసారి బఫెట్ గోల్డెన్ రూల్స్ చూస్తే అందులో బంగారానికి అస్సలు స్థానం లేదు.
అయితే బఫెట్ బరిక్ గోల్డ్ అనే బంగారం తవ్వకాలు చేపట్టే కంపెనీలో మాత్రమే పెట్టుబడి పెట్టారు. కానీ అందులో ఎక్కువ కాలం డబ్బును పెట్టుబడిగా పెట్టలేదు. అందరికీ వచ్చే అనుమానం సేఫ్ హెవెన్ అయిన గోల్డ్ లో బఫెట్ ఎందుకు పెట్టుబడులు పెట్టలేదనే. వారెన్ బఫెట్ బంగారాన్ని ఒక నాన్ ప్రొడక్టివ్ ఆస్తిగా చూస్తానని 2011లో చెప్పారు. బఫెట్ దృష్టిలో పొలాలు, వ్యాపారాలు బంగారం కంటే ఎక్కువ విలువైనవిగా పరిగణించబడుతోంది.
2011తో పోల్చేతే బంగారం రేటు ప్రస్తుతం డబుల్ అయ్యింది. సగటున బంగారం 5 శాతం రేటున వృద్ధి చెందగా ఇదే కాలంలో అమెరికా స్టాక్ మార్కెట్లు 14 శాతం రాబడిని అందించాయి. బంగారం ధరల చరిత్రను పరిశీలిస్తే.. ఒక్కసారిగా గోల్డ్ రేట్లు పెరగటానికి ముందు చాలా సంవత్సరాలు అది పెద్దగా రాబడిని ఇవ్వకుండా స్థబ్దుగా కొనసాగింది. ఉదాహరణకు గడచిన 6 నెలల కాలంలో గోల్డ్ రేట్లు 70వేల స్థాయిల నుంచి లక్షకు తులం చేరుకున్నాయి. 2020లో భారీగా తగ్గి నష్టాలను ఇచ్చిన గోల్డ్ గడచిన 5 ఏళ్లుగా పెరుగుదలను చూసింది.
ALSO READ : Gold Rate: రాఖీ రోజు గుడ్‌న్యూస్.. దిగొచ్చిన గోల్డ్ రేట్లు..
2009లో ఔన్సు బంగారం రేటు వెయ్యి డాలర్ల వద్ద ఉన్నప్పుడు రానున్న 5 ఏళ్లలో బంగారం పరిస్థితి ఎలా ఉంటుందని కామెంట్ అడగగా బఫెడ్ బదులిస్తూ.. ఏముంది గోల్డ్ ఏమీ చేయదు కాబట్టి మీ వైపు చూస్తూ ఉంటుంది అంతే అన్నారు. గోల్డ్ స్థిరమైన రాబడిని ఇవ్వదని అదొక ప్రాణం లేని ఆస్థి అని వారెన్ బఫెట్ చెబుతుంటారు అందుకే ఆయన గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయరు.