ZIM vs NZ: పసికూనపై ప్రతాపం: ముగ్గురు సెంచరీల మోత.. కివీస్‌కు ఆధిక్యం 437 పరుగులు

ZIM vs NZ: పసికూనపై ప్రతాపం: ముగ్గురు సెంచరీల మోత.. కివీస్‌కు ఆధిక్యం 437 పరుగులు

జింబాబ్వేతో గురువారం (ఆగస్టు 7) ప్రారంభమైన రెండో టెస్టులో న్యూజిలాండ్ అదరగొడుతుంది. బులవాయో వేదికగా ద క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న మ్యాచ్ లో పసికూనపై కివీస్ విశ్వరూపం చూపిస్తున్నారు. ఏకంగా ముగ్గురు సెంచరీల వర్షం కురిపించగా.. ఒకరు హాఫ్ సెంచరీ చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో కివీస్ ఆధిక్యం ఆతిధ్య జింబాబ్వేపై 437 పరుగులకు చేరింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 562 పరుగులు చేసింది. క్రీజ్ లో నీకోల్స్ (144), రచీన్ రవీంద్ర (132) ఉన్నారు. ఓపెనర్ విల్ యంగ్ 74 పరుగులు చేసి హాఫ్ సెంచరీ చేయగా.. నైట్ వాచ్ మెన్ జాకబ్ డఫి 36 పరుగులు చేసి రాణించాడు.         

వికెట్ నష్టానికి 174 పరుగులతో ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆరంభం నుంచే పరుగుల వరద పారించింది. ఈ క్రమంలో కాన్వే తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. 36 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్ద నైట్ వాచ్ మెన్ డఫిని ఔట్ చేసి రెండో రోజు జింబాబ్వే ఎట్టకేలకు తొలి వికెట్ రాబట్టింది. భారీ సెంచరీతో దూసుకెళ్తున్న కాన్వేను ముజరుభాని ఔట్ చేశాడు. కాన్వే ఔటైన తర్వాత నికోల్స్, రచీన్ రవీంద్ర జోడీ జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించారు. భారీ భాగస్వామ్యం నిర్మించి ఇద్దరూ తమ తమ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. నాలుగో వికెట్ కు వీరిద్దరూ అజేయంగా 217 పరుగులు జోడించి జట్టు ఆధిక్యాన్ని 400 దిశగా తీసుకెళ్తున్నారు.       

►ALSO READ | T20 World Cup 2026: ఇండియాలో టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా ఓపెనర్లు ఎవరో చెప్పిన మార్ష్

తొలి రోజు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 48.5 ఓవర్లలో 125 రన్స్‌కే ఆలౌటైంది. బ్రెండన్‌ టేలర్‌ (44) టాప్‌ స్కోరర్‌. టఫాడ్జ్వా సిగా (33 నాటౌట్‌) ఫర్వాలేదనిపించాడు.  మ్యాట్‌ హెన్రీ (5/40), జకారీ ఫౌల్క్స్ (4/38) బంతితో చచెలరేగి జింబాబ్వేను స్వల్ప స్కోర్ కే పరిమితం చేశారు. నిక్‌ వెల్చ్‌ (11), సీన్‌ విలియమ్స్‌ (11)తో సహా మిగతా వారు నిరాశపర్చారు. ఇన్నింగ్స్‌ మొత్తంలో ఏడుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.