పవిత్ర గోదావరి నదీ పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 2027 జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకూ 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి.
గోదావరి పుష్కరాల తేదీలు, ముహూర్తం గురించి టీటీడీ ఆస్థాన సిద్ధాంతి, ఆగమ, వైదిక పండితులు ఏపీ దేవాదాయశాఖ కమిషనర్‌కు వివరాలు అందించారు. కమిషనర్ నివేదిక.. ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత దేవ దాయ శాఖ ఎక్స్‌ఆఫిషియో సెక్రటరీ డా.ఎం.హరి జవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. పుష్కరాలు మొత్తం 12 రోజులు ఉంటాయి మరియు మొదటి రోజును పుష్కర ఆరంభం...అద్య పుష్కరం అంటారు.
- పుష్కరాలు ప్రారంభం రోజు : 2027 జూన్ 26
- పుష్కరాలు చివరి రోజు : 2027 జూలై 7
పురాణాల ప్రకారం గోదావరి పుష్కరాలు ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుగు మహోత్సవం. బృహస్పతి గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ కాలంలో గోదావరి నదిలో స్నానం చేయడం.. పూర్వీకులకు పిండప్రదానం చేయడం.. అత్యంత పవిత్రంగా భావిస్తారు. లక్షలాది భక్తులు నది తీరాలకు చేరుకుని స్నానాలు, దానాలు, పూజలు నిర్వహిస్తారు.

