గోదావరి బోర్డుకు పనే లేదు .. ప్రాజెక్టులను అప్పగించకపోవడంతో అధికారులు ఖాళీగా ఉన్నరు: సుబోధ్‌‌‌‌ యాదవ్‌‌‌‌

గోదావరి బోర్డుకు పనే లేదు .. ప్రాజెక్టులను అప్పగించకపోవడంతో అధికారులు ఖాళీగా ఉన్నరు: సుబోధ్‌‌‌‌ యాదవ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ప్రాజెక్టుల నిర్వహణా బాధ్యత లేకపోవడంతో గోదావరి రివర్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు (జీఆర్‌‌‌‌ఎంబీ)కు ప్రస్తుతం ఎలాంటి పనిలేకుండా పోయిందని కేంద్ర జల శక్తి శాఖ అడిషనల్‌‌‌‌ సెక్రటరీ సుబోధ్‌‌‌‌ యాదవ్‌‌‌‌ అన్నారు. శుక్రవారం జలసౌధలోని జీఆర్‌‌‌‌ఎంబీ ఆఫీసులో అధికారులతో ఆయన రివ్యూ చేశారు. బోర్డు పరిపాలన తీరుపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాలు ప్రాజెక్టులను అప్పగించకపోవడంతో బోర్డులకు ప్రస్తుతం అంతగా పనిలేకుండా పోయిందని  అభిప్రాయం వ్యక్తం చేశారు. 

బోర్డు అధికారులు రెండు రాష్ట్రాలతోనూ మంచిగా ఉండాలని సూచించారు. బోర్డు నిర్వహణకు సంబంధించిన నిధులను రాష్ట్రాల నుంచి మంజూరు చేయించుకోవాలని, పరిపాలన నిబంధనల మేరకు ముందుకు పోవాలని తెలిపారు.