చోరీకి గురైన అమ్మవారి పంచలోహపు విగ్రహం దొరికింది

చోరీకి గురైన అమ్మవారి పంచలోహపు విగ్రహం దొరికింది

దొంగతనానికి గురైన 108కిలోల అమ్మవారి పంచలోహ విగ్రహం లభించింది. తమిళనాడు వేలూరు జిల్లా కట్పాడి రైల్వే స్టేషన్ సమీపంలో 108కిలోల పంచలోహవిగ్రహం పడివుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు. అయితే అది కొన్ని రోజుల క్రితం   కాట్పాడిలోని వళ్లిమలై రోడ్డు వీటీకే నగర్‌లో మారియమ్మన్‌ ఆలయంలో చోరీకి గురైన విగ్రహంగా గుర్తించారు. విగ్రహాన్ని ఆలయ నిర్వాహకులకు అప్పగించారు పోలీసులు. దొంగతనం చేసిన వారే విగ్రహాన్ని ఇక్కడ వదిలేసి వెళ్లి ఉంటారని చెప్పారు.