గోల్కొండ బోనాల పోస్టర్ ఆవిష్కరణ

గోల్కొండ బోనాల పోస్టర్ ఆవిష్కరణ

 మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ బోనాల జాతర ఉత్సవాలకు జగదాంబిక ఆలయం ముస్తాబువుతోంది. వచ్చే నెల 7న బోనాల జాతర షురూ కానుంది. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయానికి రంగులు వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సౌకర్యాలను కల్పిస్తున్నట్టు ఆలయ ఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. వృత్తి పనివాళ్ల సంఘం అధ్యక్షుడు బి.  సాయిబాబాచారి, సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం బోనాల పోస్టర్ విడుదల చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. బోనాల జాతర నెల రోజులపాటు ప్రతి ఆది, గురు వారాల్లో అమ్మవారికి 9 పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  ఆలయ పూజారి సర్ఫేస్ కుమార్, సురేష్ చారి, రాజు ఉస్తాద్, ఆలయ వృత్తి పనివాళ్ల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.