
Gold Price Today: భారతీయులు తరతరాలుగా ప్రేమించే బంగారం, వెండి నిరంతరం పెరగటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవానికి స్పాట్ మార్కెట్లో ఔన్సు బంగారం 3వేల500 డాలర్లను తాకిన తర్వాత వెండి ఔన్సు 40 డాలర్లకు చేరుకోవటంతో నిపుణులు అంచనా వేసినట్లుగానే ధరల ర్యాలీ కొనసాగుతోంది. దీంతో భవిష్యత్తులో కూడా రేట్ల పెరుగుదల ఇలాగే కొనసాగే ప్రమాదం ఉందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, ముదురుతున్న యూఎస్ అమెరికా సమస్యలతో పాటు ఇతర అంశాలు రేట్లలో ర్యాలీకి కారణాలుగా ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పెరుగుతున్న రేట్లను పరిశీలించిన తర్వాత మాత్రమే షాపింగ్ నిర్ణయం తీసుకోవటం మంచిది. ఈ క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 3న గ్రాముకు రూ.88 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, తిరుపతి, కడప, విశాఖ, నెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ వంటి ప్రాంతాల్లో గ్రాము రేటు రూ.10వేల 697వద్ద రిటైల్ మార్కెట్లలో కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల బంగారం రేట్లు కూడా సెప్టెంబర్ 2తో పోల్చితే సెప్టెంబర్ 3న గ్రాముకు రూ.80 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, తిరుపతి, కడప, విశాఖ, నెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ వంటి ప్రాంతాల్లో గ్రాము రేటు రూ.9వేల 805 వద్ద నేడు రిటైల్ మార్కెట్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి.
బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారాంతంలో కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 3న ఏపీ, తెలంగాణలోని నగరాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.900 పెరుగుదలను చూసింది. దీంతో కేజీ వెండి రేటు ప్రస్తుతం రూ.లక్ష 37వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.137 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.