భారీగా తగ్గిన బంగారం ధర.. అదే బాటలో వెండి ధరలు

భారీగా తగ్గిన బంగారం ధర.. అదే బాటలో వెండి ధరలు

గోల్డ్ కొనాలకునే వారికి గుడ్ న్యూస్. బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఈ మధ్య ఎన్నడూ లేనంతగా బంగారం ధర ఒక్కరోజులోనే పడిపోయింది. దీంతో వరుసగా 3 రోజులుగా గోల్డ్ రేటు దిగొచ్చినట్లయింది. 

ప్రస్తుతం మళ్లీ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాల నేపథ్యంలో డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ పుంజుకుంటుండటంతో బంగారం, వెండి రేట్లు దిగొస్తున్నాయి. 3 రోజుల్లో భారీగా బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. 

సెప్టెంబర్ 29న హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.53 వేల 890గా ఉంది. ధరలు తగ్గడంతో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.59 వేల 790 రూపాయలుగా ఉంది. 

ఇక వెండి విషయానికి వస్తే.. హైదరాబాద్ నగరంలో కిలో వెండి రూ.76 వేల 500 గా ఉంది. గత వారంతో పొలిస్తే బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే.. ఈ ధరలు ఇంకా ఎంత వరకు తగ్గుతాయే దానిపై మాత్రం క్లారిటీ లేదు. 

ఇటు అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. గత కొన్ని వారాలుగా పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారానికి రూ.60 వేలు పలికింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.55 వేలుగా ఉంది.