పరుగో పరుగు : బంగారం రూ.73 వేలు.. వెండి రూ.90 వేలు

పరుగో పరుగు : బంగారం రూ.73 వేలు.. వెండి రూ.90 వేలు

బంగారం, వెండి ధరలు బ్రేక్స్ లేకుండా నాన్ స్టాప్ గా పరుగులు పెడుతున్నాయి. 2024 ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం రోజున మరోసారి పెరిగాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1000 పెరిగి  67వేల 200కు చేరుకుంది.  ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1090 పెరిగి  73వేల 310కు చేరుకుంది.  దేశంలోని  వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.  

దేశ రాజధాని ఢిల్లీలో    22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 68 వేల 350గా ఉంది.  ఇక  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 73 వేల460గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 67వేల 200గా ఉంది.  ఇక  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 73 వేల310గా ఉంది. 

హైదరాబాద్ విషయానికి వస్తే..   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 67 వేల 200 ఉండగా..  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 73 వేల 310గా ఉంది. వైజాగ్ లో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 67 వేల 200 ఉండగా..  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 73 వేల 310గా ఉంది. 

బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి.  2024 ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం రోజున ఏకంగా రూ. 1500 పెరిగింది.  దీంతో కేజీ వెండి ధర రూ. 90 వేలకు  చేరుకుంది.  హైదరాబాద్ , ,చెన్నైలలో కేజీ వెండి రూ.  90వేలుగా ఉండగా...  ముంబై,  ఢిల్లీ,  కోల్ కత్తాలో రూ.  86 వేల 500గా ఉంది.