షాకిచ్చిన బంగారం, వెండి ... ధరలు పైపైకి

షాకిచ్చిన బంగారం, వెండి ... ధరలు పైపైకి

బంగారం, వెండి ధరలు మరోసారి షాకిచ్చాయి. 2024 ఏప్రిల్ 10వ తేదీ బుధవారం రోజున  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 350 పెరిగింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 380 పెరిగింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 

దేశ రాజధాని ఢిల్లీలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66 వేల 250 గాఉండగా..   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  72 వేల 260 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66 వేల 100 గాఉండగా..   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  72 వేల 110 గా ఉంది.

ఇక హైదరాబాద్ లో   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66 వేల 100 గాఉండగా..   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  72 వేల 110 గా ఉంది. విశాఖపట్నంలో   22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66 వేల 100 గాఉండగా..   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.  72 వేల 110 గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు నడిచాయి. ఏకంగా నిన్నటి ధరతో పోలిస్తే కేజీ వెండిపైన రూ. 1000 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్ లో కేజీ వెండి  రూ.  89వేలుగా ఉంది.   ముంబై, ఢిల్లీ, కోల్ కత్తాలో  రూ.  85 వేలుగా ఉన్న వెండి..  హైదరాబాద్ లో  రూ.  89 వేలుగా ఉంది.