Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్‌

Gold Rates :  హమ్మయ్యా..  బంగారం, వెండి  ధరలు తగ్గాయోచ్‌

ప్రతి రోజూ పెరుగుకుంటూ పోతున్న బంగారం ధరలు ఏప్రిల్ 24వ తేదీ బుధవారం రోజున తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.  1060 దిగొచ్చి.. రూ. 66 వేల 600 కి చేరుకుంది. ఇక  24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 1030 తగ్గి.. రూ 72 వేల 650 కి చేరింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.  

దేశ రాజధాని ఢిల్లీలో   22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 66 వేల 600గా ఉంది. ఇక  24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 72 వేల 800గా ఉంది.  ఆర్థిక రాజధాని ముంబైలో  22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.  66 వేల 600గా ఉండగా..  24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 72 వేల 650గా ఉంది.  

హైదరాబాద్ లో  22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 66 వేల 600గా ఉంది.  24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 72 వేల 650 గా ఉంది. వైజాగ్ లో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 66 వేల 600గా ఉంది.  24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 72 వేల 650 గా ఉంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి.

Also Read:ఈ మందులు వాడుతున్నారా..చాలా డేంజర్

వెండి ధరలు కూడా బుధవారం భారీగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,290 గా ఉంది. మంగళవారం ఈ ధర రూ. 8,540గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 82,900కి చేరింది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 86,400 పలుకుతోంది.