
దేశీయంగా గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు రూ.53,800గా ఉంది. ఒక్కరోజే రూ.250 పెరిగింది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములకు రూ.270 ఎగబాకి రూ.58,690కి చేరుకుంది. అయితే మార్చి 9న 10 గ్రాముల బంగారం ధర రూ, 50,900గా ఉంది. ఇంతలోనే ఏకంగా రూ. 3000కు పుంజుకుని ఇప్పుడు రూ.53,950కి చేరింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.270 పెరిగి రూ.58,840గా ఉంది. మరోవైపు బంగారం ధరలోనే వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో కిలో వెండి రూ. 4 వేలకు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.400 పెరిగి రూ.73,100 దగ్గర ఉంది. వారం కిందట రూ.67,300గా ఉంది.