ఒక్కరోజులోనే వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం .. ఇప్పుడు తులం ఎంతంటే?

ఒక్కరోజులోనే వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం .. ఇప్పుడు తులం ఎంతంటే?

బంగారం కొనాలని అనుకుంటున్నారా..  అయితే ఇది మీకు కచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే.. ఒక్కరోజులోనే బంగారం ధర దాదాపుగా రూ. 1000కి  తగ్గింది.  22 క్యారెట్ల10 గ్రాముల బంగారం రూ. 900 తగ్గి ధర రూ.  66 వేల400గా ఉంది. ఇక 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 980 తగ్గి రూ.  72 వేల440గా ఉంది.  దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.  

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం రూ. 66 వేల 550గా ఉండగా..  24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 72 వేల 590గా ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో  22 క్యారెట్ల10 గ్రాముల బంగారం రూ. 66 వేల 400గా ఉండగా..  24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 72 వేల 440 గా ఉంది. 

హైదరాబాద్  లో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం రూ. 66 వేల 400గా ఉండగా..  24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 72 వేల 440గా ఉంది.  ఇక విజయవాడ, వైజాగ్ లలో  22 క్యారెట్ల10 గ్రాముల బంగారం రూ. 66 వేల 400గా ఉండగా..  24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 72 వేల 440గా ఉంది.  

బంగారంతో పాటుగానే గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. 2024 మే 24వ తేదీన  రూ. 500 తగ్గి  కేజీ వెండి రూ.96 వేల 500కు చేరుకుంది. చెన్నై, హైదరాబాద్ లలో రూ. 96 వేల500గా ఉన్న వెండి ధర..  ముంబై, ఢిల్లీ, కోల్ కత్తా, బెంగళూరులో రూ. 92 వేలుగా ఉంది.