Gold Rate: మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్లు.. ఏపీ-తెలంగాణ మంగళవారం రేట్లివే..

Gold Rate: మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్లు.. ఏపీ-తెలంగాణ మంగళవారం రేట్లివే..

Gold Price Today: స్పాట్ మార్కెట్లో మంగళవారం గోల్డ్ రేటు గరిష్ఠమైన ఔన్సు 3వేల 500 డాలర్ల మార్కును చేరుకుంది. దీంతో దేశీయంగా కూడా రిటైల్ మార్కెట్లలో గోల్డ్ రేటు 10 గ్రాములకు లక్షకు పైనే కొనసాగుతోంది. ప్రధానంగా వాణిజ్య ఉద్రిక్తతలతో పాటు ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వార్తలు ర్యాలీకి ఆజ్యం పోస్తున్నాయి. దీనికి తోడు గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల నిరంతర కొనుగోళ్లు కూడా భారీగా బంగారానికి డిమాండ్ క్రియేట్ చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏడాది కాలంలో గోల్డ్ 40 శాతం పెరగటంతో పాటు.. ఇప్పటికే రేట్లు ఆకాశానికి చేరుకున్న వేళ రిటైల్ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ముందుకెళ్లాలని వారు అంటున్నారు. అయితే ఆభరణాలు కొనుగోలు చేసేవారు పెరిగిన ఇవాల్టి రేట్లను గమనించాలి. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 1తో పోల్చితే 10 గ్రాములకు సెప్టెంబర్ 2న రూ.210 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.21 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..

ALSO READ : తగ్గిన కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌‌‌‌

24 క్యారెట్ల బంగారం గ్రాముకు రేటు:
హైదరాదాబాదులో రూ.10వేల 609
కరీంనగర్ లో రూ.10వేల 609
ఖమ్మంలో రూ.10వేల 609
నిజామాబాద్ లో రూ.10వేల 609
విజయవాడలో రూ.10వేల 609
కడపలో రూ.10వేల 609
విశాఖలో రూ.10వేల 609
నెల్లూరు రూ.10వేల 609
తిరుపతిలో రూ.10వేల 609

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 1తో పోల్చితే ఇవాళ అంటే సెప్టెంబర్ 2న 10 గ్రాములకు రూ.200 పెరుగుదలను చూసింది. దీంతో మంగళవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల బంగారం గ్రాముకు రేటు:
హైదరాదాబాదులో రూ.9వేల 725
కరీంనగర్ లో రూ.9వేల 725
ఖమ్మంలో రూ.9వేల 725
నిజామాబాద్ లో రూ.9వేల 725
విజయవాడలో రూ.9వేల 725
కడపలో రూ.9వేల 725
విశాఖలో రూ.9వేల 725
నెల్లూరు రూ.9వేల 725
తిరుపతిలో రూ.9వేల 725

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ స్వల్ప ర్యాలీని కొత్త నెలలో కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 2న కేజీకి వెండి సెప్టెంబర్ 1తో పోల్చితే వంద రూపాయలు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 36వేల 100కు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.136.10 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.