
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు పెరగడంతో గురువారం ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.680 పెరిగి రూ.73,500కి చేరింది. క్రితం సెషన్‌లో 10 గ్రాముల ధర రూ.72,820 వద్ద ముగిసింది. గత సెషన్‌లో కిలో వెండి రూ.91,900 నుంచి రూ.1,400 పెరిగి రూ.93,300కి చేరుకుంది. కమోడిటీ ఎక్స్చేంజీలో స్పాట్ బంగారం ఔన్సుకు (దాదాపు 28 గ్రాములు) 2,360 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 28 డాలర్లు పెరిగింది. వెండి కూడా ఔన్సుకు 30.30 డాలర్లు వద్ద ట్రేడవుతోందని వ్యాపారులు తెలిపారు.