87 కోట్ల విలువైన బంగారం ముద్ద

87 కోట్ల విలువైన బంగారం ముద్ద
  • న్యూయార్క్​లో ఓ కంపెనీ పబ్లిసిటీ స్టంట్

మెరిసేదంతా బంగారం కాదనే సామెత కొన్నిసార్లు నిజం కాకపోవచ్చని న్యూయార్క్ వాసులు అంటున్నరు. ముఖ్యంగా సిటీ సెంట్రల్​ పార్క్​ చుట్టుపక్కల ఉండేటోళ్లు ఇదే చెప్తున్నరు. పార్క్​లో ఓ భారీ బంగారం క్యూబ్​ కనిపించడమే దీనికి కారణం. పార్క్​లో ఓ చోట కనిపించిన ఈ క్యూబ్​ అచ్చంగా స్వచ్ఛమైన బంగారమేనట. ఏకంగా 186 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగించి దీనిని తయారు చేశారట. దీని విలువ 11.7 మిలియన్ల అమెరికన్ ​ డాలర్లు( మన రూపాయల్లో 87 కోట్ల పై మాటే). నాలుగైదు గ్రాముల బరువున్న నగలను కూడా అద్దాలలో పెట్టి తాళమేసే ఈ రోజుల్లో అంతపెద్ద బంగారు ముద్దను ఇలా పార్కులో ఎందుకేశారు.. ఎవరన్నా ఎత్తుకెళితే ఎట్లా అని అక్కడి జనం అనుకున్నరట. అయితే, క్యూబ్​ను ఎప్పటికప్పుడు గమనిస్తూ సెక్యూరిటీ సిబ్బంది దగ్గర్లోనే ఉన్నారు. కొత్తగా లాంచ్​చేయబోయే క్రిప్టో కాయిన్​ ప్రచారం కోసం బంగారు క్యూబ్​ను పార్క్​లో పెట్టామని.. క్యూబ్​ను తయారుచేసిన జర్మనీ ఆర్టిస్ట్​ నిక్లస్​ కాస్టెల్లో చెప్పారు. ఈ ప్రదర్శన కేవలం ఆ ఒక్క రోజుకే పరిమితం చేశారు.