
న్యూఢిల్లీ: బంగారం ధరలు బుధవారం (సెప్టెంబర్ 03) రికార్డు గరిష్ట స్థాయికి చేరాయి. ఢిల్లీ మార్కెట్లలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,000 పెరిగి రూ. 1,07,070 వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది.
ఫెడ్ రేట్ల తగ్గింపు అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, యూఎస్ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు వంటివి బంగారం ధర పెరగడానికి కారణమని నిపుణులు తెలిపారు. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, మంగళవారం 10 గ్రాముల బంగారం (99.9 శాతం స్వచ్ఛత) ధర రూ. 1,06,070 వద్ద క్లోజ్ అయింది.
బుధవారం (సెప్టెంబర్ 03) 99.5 శాతం స్వచ్ఛత గల పసిడి ధర రూ.1,000 పెరిగి రూ. 1,06,200కు చేరింది. వెండి ధర కిలోకు రూ. 1,26,100 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.