మెరుస్తున్న మణప్పురం, ముత్తూట్

మెరుస్తున్న మణప్పురం, ముత్తూట్

నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీల్లో మణప్పురం,ముత్తూట్ స్ట్రాంగ్​గా ఉన్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది. నాన్ బ్యాంక్ ఫైనాన్స్ దిగ్గజ కంపెనీల్లో ఓ వైపు దిగ్గజాలు నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు గోల్డ్ లోన్ కంపెనీలు దూసుకుపోతున్నాయి. గత ఏడు నెలల కాలంలోనాన్ బ్యాంక్ లెండర్స్‌ లో గోల్డ్ లోన్ కంపెనీలు మెరుగైన లాభాలను అందించి నట్టు తెలిసింది. గత సెప్టెంబర్ నుంచి ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్స్ ట్యాక్స్ 50 శాతం, మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ ట్యాక్స్ 26 శాతం పెరిగినట్టు బ్లూమ్‌ బర్గ్ డేటాలో వెల్లడైంది. ఈ రెండు కంపెనీలు ఈ మేర లాభాలపంట పండిస్తుంటే.. దిగ్గజాలు మాత్రం పూర్తిగా కుప్పకూలడం లేదా కేవలం సింగిల్ డిజిటల్ లాభాలనే ఆర్జించడం గమనార్హంగా ఉంది. నాన్ బ్యాంక్ ఫైనాన్స్‌ కంపెనీల్లో బాగా పేరున్న ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ బిల్డర్, ఫైనాన్సియర్ ఐఎల్ఎఫ్ఎస్‌ గతేడాది రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమై, దివాలాతీసింది. ఐఎల్‌ ఎఫ్‌ఎస్ పరిస్థితి ఇలా అయ్యే సరికి మిగతా నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీలకు బయట నిధులు దొరకడం కష్టమైంది. ఈ కష్టాలతో చాలా కంపెనీలు ఇబ్బందులు పడ్డాయి. అంతేకాక ఈ కంపెనీల అసెట్ లయబులిటీ పరిస్థితులపై కూడాపెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ఇతర రంగాలకూ విస్తరణ
మెరుగైన రిటర్నులను ఆర్జించడానికి… మణప్పురం, ముత్తూట్ కంపెనీలు వారి పోర్ట్‌‌ ఫోలియోలను కేవలం బంగారంపైనే ఉంచకుండా.. కమర్షియల్ వెహికిల్స్, హౌజింగ్ ఫైనాన్స్, మైక్రోఫైనాన్స్‌ లకువిస్తరించాయి. తమ నాన్ గోల్డ్ వ్యాపారాల షేరు 2శాతం పెరిగి 32 శాతానికి చేరుకుంటుందని మణప్పురం ఫైనాన్స్ మేనేజ్‌ మెంట్ అంచనావేస్తోంది. అదేవిధంగా గోల్డ్ నుంచి వచ్చే షేరు కూడా 10శాతం నుంచి 12 శాతం పెరుగుతోందని పేర్కొంటోంది. పోర్ట్‌‌ఫోలియో విస్తరణలో ముత్తూట్ కూడాసరైన మార్గంలో పయనిస్తోందని, గోల్డ్ లోన్ వ్యాపారాల్లో పెట్టుబడుల పరంపర కొనసాగుతోందని, నాన్ గోల్డ్ బిజినెస్‌ లు కూడా స్థిరమైన వృద్ధి సాధిస్తున్నాయని ఆంటిక్యూ స్టాక్ బ్రోకింగ్ తెలిపింది. ముత్తూట్ గోల్డ్ లోన్ వ్యాపారాల్లో వార్షికంగా 12శాతం వృద్ధిని అంచనా వేస్తున్నామని, అంతేకాక ఆస్తులపై 6 శాతానికి పైగా రిటర్నులు వస్తున్నట్టు చెప్పింది. మణప్పురం గోల్డ్ లోన్ వ్యాపార లాభాలు చాలా మెరుగ్గా ఉన్నాయని, లెండింగ్ రేట్లు కూడా గరిష్టస్థాయులకు ఎగిశాయని తెలిపింది. ఖర్చులు బాగా తగ్గించుకోవడంతో లాభదాయకత పెరిగిందని పేర్కొంది. గోల్డ్ లోన్ వ్యాపారాలవృద్ధి, నాన్ గోల్డ్ బిజినెస్‌ లలో లాభాల మెరుగుదల… మణప్పురానికి పంట పండిస్తున్నాయని పేర్కొంది. మణప్పురం ఫైనాన్స్ స్టాక్‌ కు ఎక్కువ శాతం మంది విశ్లేషకులు ‘కొనుగోలు’ రేటింగ్‌ నే ఇస్తున్నారు. 80 శాతం మంది ఈ కంపెనీ స్టాక్‌ ను కొనచ్చని చెబుతున్నారు. ఇక మిగతా 20 శాతంమంది మాత్రమే హోల్డ్ లేదా సెల్ చేయమని చెబుతున్నారు. ఈ కంపెనీ 12 నెలల టార్గెట్ ధరరూ.124.50. ముత్తూట్ ఫైనాన్స్ స్టాక్‌ ను కూడా80 శాతం మంది విశ్లేషకులు కొనుగోలు చేయొచ్చని ఇన్వెస్టర్లకు రికమెండ్ చేస్తున్నారు. దీని టార్గెట్ ధర ఒక్కో షేరుకి రూ.630.13.

నిబంధనలు కఠినతరం..
అయినా స్థిరమైన వృద్ధిగోల్డ్ లోన్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ఇండియా పలు సార్లు నిబంధనలను కఠినతరం చేసింది. గోల్డ్ లోన్ కంపెనీలు బంగారాన్ని తనఖా పెట్టుకొని క్యాష్ రూపంలో అందించే అప్పుల కేవలం రూ.20వేలు మించకూడదని ఆర్‌‌‌‌బీఐ పరిమితి విధించింది. అంతకముందు ఈ లిమిట్ లక్ష రూపాయలుగా ఉండేది. అయితే గోల్డ్ లోన్ కంపెనీలకు చాలా పన్ను నిబంధనల నుంచి ఇప్పుడిప్పుడే విముక్తి లభించిందని జేఎం ఫైనాన్సియల్ లిమిటెడ్ విశ్లేషకుడు వసంత్ లోహియా చెప్పారు. ఆర్‌‌‌‌బీఐ విధించిన నిబంధనలతో కూడా తమకు అంత పెద్ద ప్రమాదమేమీ లేదని ముత్తూట్ ఫిన్‌ కార్ప్‌‌ సీఓఓ వాసుదేవన్ రామస్వామి చెప్పారు. తమవ్యాపారాలు స్థిరంగా ఉన్నాయని, 2020 ఆర్థిక సంవత్సరంలో తమ గ్రోత్ రేట్ 16 శాతం నుంచి18 శాతం ఉండాలని టార్గెట్‌ గా పెట్టుకున్నామని చెప్పారు. మరోవైపు గోల్డ్ లోన్ల కాల పరిమితులను మణప్పురం తగ్గించింది. మణప్పురం గోల్డ్ లోన్ల కాల పరిమితి మూడు నుంచి నాలుగు నెలలకు కుదించింది. ముత్తూట్ మాత్రం ప్రస్తుతం ఏడాదికాల పరిమితినే కొనసాగిస్తోంది. గోల్డ్ ధరలుపెరిగితే, రుణాలిచ్చే ఇచ్చే మొత్తం పెరుగుతోంది.అదే గోల్డ్ ధరలు తగ్గితే ఎన్‌పీఏల రిస్క్‌‌ ఎదురవుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని బిజినెస్ చేస్తే..గోల్డ్ లోన్ కంపెనీలకు ఆటంకాలు తగ్గి, ఇన్వెస్టర-్లలో విశ్వాసం బలపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.