గ్రాము బంగారంపై రూ.30 తగ్గింపు

గ్రాము బంగారంపై రూ.30 తగ్గింపు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. గత కొన్ని రోజులుగా నాన్ స్టాప్ గా పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. కొనుగోలుదారులకు స్వల్ప ఊరట కలిగిస్తూ.. పసిడి ధరలు తగ్గాయి.  ఏప్రిల్ 18వ తేదీ గురువారం బంగారం, వెండి ధరలు దేశవ్యాప్తంగా స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల ఒక గ్రాముపై రూ.30, 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారంపై రూ.33 తగ్గింది.  దీంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 67,650  ఉండగా..  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.73,800గా ఉంది.  

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,800గా ఉంది.  ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,950గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబై నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,650గా ఉంది.  ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,800గా ఉంది. 

బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.  ఈ రోజు కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో  తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర  రూ.89,900గా ఉంది. ఇక,  ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, చెన్నైలలో కేజీ వెండి రూ. 86,500గా ఉంది.