వారంలో రూ. 2,500 తగ్గిన గోల్డ్ ధర

వారంలో రూ. 2,500 తగ్గిన గోల్డ్ ధర

వరుసగా నాలుగో రోజూ పతనం
పది గ్రాముల బంగారం@49,293
డాలర్‌ బలోపేతమే కారణమంటున్న ట్రేడర్లు
వెండి రేట్ల నేలచూపులు
ప్రస్తుతం కిలోరేటు రూ.56,710

ముంబై: పండగ సీజన్‌ దగ్గరపడుతున్నప్పటికీ బంగారం, వెండి రేట్లు తగ్గుతూనే ఉన్నాయి. వరుసగా నాలుగో రోజైన గురువారం కూడా ఈ ఈ రెండు మెటల్స్‌ రేట్లు తగ్గుముఖం పట్టాయి. మల్టీకమోడిటీ ఎక్సేంజీ అక్టోబరు గోల్డ్‌ ఫ్యూచర్స్‌‌లో పది గ్రాముల గోల్డ్‌ రేటు 0.45 శాతం తగ్గి రూ.49,293కు పడిపోయింది. వెండి రేట్లు మూడుశాతం తగ్గాయి. కిలో రేటు ప్రస్తుతం రూ.56,710 ఉంది. నాలుగు సెషన్లలో పది గ్రాముల గోల్డ్‌ రేటు రూ.2,500 వరకు తగ్గింది. ఇది వరకటి సెషన్‌‌లో పసిడి రేటు 1.9 శాతం అంటే రూ.950 తగ్గింది. వెండి రేటు కిలోకు రూ .2,700లు పడిపోయిందని బులియన్‌ ట్రేడర్లు చెప్పారు.

ఇంటర్నేషనల్‌ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి…
ప్రపంచవ్యాప్తంగానూ బంగారం రేట్లు గురువారం తగ్గాయి. ప్రస్తుత రేట్లు గత రెండు నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువకు చేరాయి. అమెరికా డాలర్‌‌‌‌ తిరిగి బలపడుతుండటంతో ఇన్వెస్టర్‌లు గోల్డ్‌ వైపు చూడటం లేదు. గ్లోబల్‌‌‌‌ మార్కెట్లలో స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌ (దాదాపు 28 గ్రాములు) రేటు 0.3 శాతం తగ్గి 1,858.08 డాలర్లకు (దాదాపు రూ.1.37 లక్షలు) పడిపోయింది. డాలర్‌‌‌‌ విలువ గత ఎనిమిది వారాల్లో ఎన్నడూ లేనంత ఎక్కువ పెరిగింది. యూరప్‌ దేశాల్లో ఎకనమిక్‌ క్రైసిస్‌ ఏర్పడే పరిస్థితులు ఉండటమూ ఇందుకు కారణం. డాలర్ విలువ పెరగడంతో ఇతర దేశాల్లో బంగారం రేట్లు ఎక్కువయ్యాయి. కరోనా కేసులు పెరుగుతూనే ఉండటం వల్ల యూరోజోన్‌ ఎకనమిక్‌ యాక్టివిటీ ఈ నెల మందకొడిగా ఉంది. వెండి రేట్లు రెండు నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువకు పడిపోయింది. ప్రస్తుతం దీని ఔన్స్‌ రేటు 22.23 డాలర్లు (దాదాపు రూ.1,643) ఉంది. అయితే అమెరికా జాబ్‌ డేటా వెల్లడయితే పరిస్థితుల్లో మార్పులు ఉండవచ్చు.

For More News..

రాష్ట్రంలో మరో 2,381 కరోనా కేసులు

చంచల్​గూడ జైలుకు రిమాండ్ ఖైదీగా ఏసీపీ నర్సింహారెడ్డి

ఎన్‌కౌంటర్ మృతులకు రీపోస్టుమార్టం చేయండి