బంగారం ధర@ రూ.68 వేల 420

బంగారం ధర@ రూ.68 వేల 420
  •     హైదరాబాద్​లో రూ.69,380

న్యూఢిల్లీ :  దేశ రాజధానిలో బంగారం ధర (10 గ్రాములు) సోమవారం రూ.1,070 పెరిగి ఆల్‌‌టైమ్‌‌ గరిష్ఠ స్థాయి రూ.68,420లకు చేరుకుంది. హైదరాబాద్​లో ధర రూ.69,380లకు చేరింది. గ్లోబల్ మార్కెట్లలో మెటల్‌‌లో ర్యాలీ కారణంగా పసిడి ధరలు దూసుకెళ్లాయి. క్రితం ట్రేడింగ్‌‌లో 10 గ్రాముల విలువైన గోల్డ్​ రూ.67,350 వద్ద ముగిసింది. వెండి ధర కూడా కిలో రూ.1,120 పెరిగి రూ.78,570కి చేరుకుంది.

క్రితం ట్రేడింగ్‌‌లో కిలో రూ.77,450 వద్ద ముగిసింది. యూఎస్​ ఫెడ్​ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటంతో బంగారం ధరలు రికార్డు స్థాయిలను తాకాయి.  చైనా నుంచి బలమైన డిమాండ్ వల్ల ధరలు పెరుగుతున్నాయని హెచ్‌‌డీఎఫ్‌‌సీ సెక్యూరిటీస్‌‌లోని రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ చెప్పారు.

ఎంసీఎక్స్​లో ఫ్యూచర్స్ ట్రేడ్‌‌లో, జూన్ కాంట్రాక్ట్ బంగారం ధర10 గ్రాములకు రూ.978 పెరిగి రూ.68,679కి చేరుకుంది. మే నెల కాంట్రాక్టు వెండి కిలో రూ.763 పెరిగి రూ.75,811కి చేరుకుంది. విదేశీ మార్కెట్లలో, స్పాట్ కమోడిటీ ఎక్స్ఛేంజ్​ బంగారం ధరలు ఔన్స్‌‌కు  2,265.73 డాలర్ల వరకు పెరిగాయి.