న్యూఢిల్లీ: స్టాకిస్టులు, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో ఢిల్లీలో శుక్రవారం బంగారం ధర రూ. 2,200 పెరిగి 10 గ్రాములకు రూ. 1,25,600కి చేరుకుంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర గురువారం 10 గ్రాములకు రూ. 1,23,400 వద్ద ముగిసింది.
99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా రూ. 2,200 పెరిగి 10 గ్రాములకు రూ. 1.25 లక్షలకు చేరుకుంది. రూపాయి విలువ తగ్గడం వల్ల బంగారం ధర పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, దేశీయ ఈక్విటీలు బలహీనంగా ఉండడం, విదేశీ మార్కెట్లలో డాలర్ బలంగా ఉండడం రూపాయికి ప్రతికూలంగా మారాయి. వెండి ధర మాత్రం కిలోగ్రాముకు రూ. 2,000 తగ్గి రూ. 1.53 లక్షలకు చేరుకుంది.
