
పసిడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. అంతర్జాతీయంగా ధర పెరగడంతో గురువారం దేశీయంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఏకంగా రూ.770 పెరిగి రూ.58,680కి చేరింది. గత ట్రేడింగ్ సెషన్ లో 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ. 57,910 ఉంది.
కిలో వెండి రేటు కూడా బాగా పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1491 వరకు పెరిగింది. ఈ దెబ్బతో కిలో వెండి ధర రూ. 71,666కి చేరుకుంది. అయితే, దీనికి కారణం.. అంతర్జాతీయంగా వీటి ధరలు పెరగడంలో దేశీయంగా కూడా వీటి ధరలు పెరిగాయని హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్ వెల్లడించింది. అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్లు పెరగడమే అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడానికి కారణం అని ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు.