
గోల్డ్ ధరలు మరింత పెరుగుతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెకర్(ఇండియా) సోమ సుందరమ్ పీఆర్ అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు పడిపోవడం, కరోనా ప్రభావం, జియో పొలిటికల్ టెన్షన్లు, రూపాయి–డాలర్ ఎక్స్చేంజ్ రేటు, కరోనా కారణంతో గ్లోబల్ ఎకానమీ పడిపోవడం వంటివి గోల్డ్‌పై బుల్లిష్ సెంటిమెంట్‌ను కలుగజేస్తున్నాయని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఏడాదే అమెరికా ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. దీంతో వచ్చే 12 నెలల్లో దేశీయ మార్కెట్‌లో గోల్డ్ ధరలు 10 గ్రాములకు రూ.65 వేలు చేరుకున్నా ఆశ్చర్య పోనక్కర్లేదని జ్యూవల్లరీ బ్రాండ్ పీఎన్ గాడ్గిల్ ఎండీ, సీఈవో సౌరభ్ గాడ్గిల్ అన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఔన్స్‌కు 2,500 డాలర్లు చేరుకుంటుందని ఆయన భావిస్తున్నారు.