గుడ్ న్యూస్ : రూ.1,500 తగ్గిన బంగారం ధర

గుడ్ న్యూస్ : రూ.1,500 తగ్గిన బంగారం ధర

న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లలో బలహీనమైన ధోరణి కారణంగా గురువారం దేశ రాజధానిలో బంగారం ధరలు రూ.1,500 తగ్గి రూ.99,250కి చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర బుధవారం 10 గ్రాములకు రూ.1,00,750 వద్ద ముగిసింది.   99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర గురువారం రూ.1,550 తగ్గి 10 గ్రాములకు రూ.98,800కి చేరుకుంది. గత సెషన్‌‌‌‌‌‌‌‌లో ఇది 10 గ్రాములకు రూ.1,00,350 వద్ద స్థిరపడింది.

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం యూకేతో వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర బాగా పడిపోయిందని త్రివేది అనే ఎనలిస్టు చెప్పారు. వెండి ధరలు బుధవారం కిలోకు రూ.98,940 వద్ద ముగియగా, గురువారం ధర రూ.740 తగ్గి రూ.98,200కి చేరుకున్నాయి. ఫ్యూచర్స్ ట్రేడ్‌‌‌‌‌‌‌‌లో, జూన్‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్టు ధర కాంట్రాక్ట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌‌‌‌‌‌‌‌లో 10 గ్రాములకు రూ.383 తగ్గి రూ.96,707కి చేరుకుంది. విదేశీ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ 20.69 డాలర్లు తగ్గి ఔన్సు ధర (28.3 గ్రాములు)3,343.81 డాలర్లకు చేరుకుందని వ్యాపారులు చెప్పారు.