భారీగా పెరిగిన బంగారం ధరలు

భారీగా పెరిగిన బంగారం ధరలు

ఇవాళ (అక్టోబర్15న) బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. పండుగల సీజన్ లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూసే.. శనివారం 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర రూ. 58వేల 910 ఉండగా.. 1530 రూపాయలు పెరిగి ప్రస్తుతం రూ. 60వేల 440కి చేరుకుంది. మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54వేలు ఉండగా.. 1400  రూపాయలు పెరిగి రూ. 55వేల400 లకు చేరింది. 

ఇటీవలి కాలంలో బంగారం ధరలు ఆరు నెలల కనిష్టానికి చేరుకున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్లు 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ. 52వేల 600, రూ. 57వేల 380కి పడిపోయాయి. అయితే తాజాగా ఒక్కసారిగా బంగారం పెరిగిపోవడంతో కొనుగోను దారులు నిరాశ చెందుతున్నారు. పండగ సీజన్ లో బంగారం కొనాలనుకునేవారు  వెనక్కి తగ్గుతున్నారు. అయితే ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చాలా మంది అంచనా వేస్తున్నారు.