రోజు రోజుకి పెరుగుతున్న బంగారం ధరలు

రోజు రోజుకి పెరుగుతున్న బంగారం ధరలు

బంగారం ధర రోజుకు కొంత పెరుగుతోంది.  వారం రోజుల్లోనే ధరల్లో భారీగా మార్పులొచ్చాయి. 10 గ్రాములు 51 వేల మార్క్ దాటడంతో బంగారం కొనాలనుకునే వారికి నిరాశే ఎదురవుతోంది. కరోనా ఎఫెక్ట్ తో ఈ ఏడాది మొదటి నుంచే సేల్స్ తగ్గినా...ఇప్పుడు పెరిగిన ధరలతో కొనేందుకు కస్టమర్లు వెనకాడుతున్నారు. గోల్డ్ రేట్లలో ఇంత వ్యత్యాసాలు రావడానికి కారణమేంటి. మరి ఫ్యూచర్ లో బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా... ? 

మూడు నాలుగు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పెళ్ళిళ్ల సీజన్ నడుస్తుండగా ... రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములకు 51 వేయ్యి 3వందలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 45 వేల 8వందలుగా ఉంది. వెండి ధరల్లోనూ ప్రతిరోజూ మార్పులు వస్తున్నాయి. వెండి కిలో 63 వేలకు చేరింది. 

ప్రతి ఏడాదీ జనవరి నుంచే గోల్డ్ సేల్స్ పెరుగుతాయి. కానీ ఈసారి జనవరి మొదటి వారంలో కరోనా ఎఫెక్ట్ తో అమ్మకాలు జరగలేదు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ధరల్లో హెచ్చు తగ్గులు మాత్రం కనిపిస్తున్నాయి. ఈ వారంలోనే బంగారం ధర దాదాపు వెయ్యి నుంచి 12వందల రూపాయల దాకా పెరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ద వాతావరణం వల్లే గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయంటున్నారు గోల్డ్ షాపుల నిర్వాహకులు. 

గతేడాది ఇదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 47 వేల దాకా ఉండగా...22 క్యారెట్ల గోల్డ్ రేట్ 43 వేలకు అటు ఇటుగా ఉంది. కానీ ఈ ఏడాది ప్రారంభంలో కరోనా ఎఫెక్ట్ పడగా... ఫిబ్రవరిలో గోల్డ్ రేట్స్ పెరగడంతో వారం రోజుల్లో  సేల్స్ 20 నుంచి 35 శాతానికి పడిపోయినట్లు గోల్డ్ షాపు ఓనర్లు చెబుతున్నారు. బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతుండటంతో కొనే వారికి  నిరాశే ఎదురవుతోంది. అవసరమైతే తప్ప బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మధ్య తరగతి సామాన్య జనం ఎప్పుడు ధరలు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా ధరలు పెరుగుతాయన్న భయం ఉందంటున్నారు. గ్లోబల్ గా స్టాక్ మార్కెట్స్ , ఈక్విటీ మార్కెట్ అన్నీ పతనం అవడంతో గోల్డ్ రేట్లు పెరుగుతాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు.