పెరుగుతున్న బంగారం ధరలు.. 10 గ్రాములు రూ.61 వేలు

పెరుగుతున్న బంగారం ధరలు.. 10 గ్రాములు రూ.61 వేలు

బంగారం ధరలు సామాన్యునికి అందనంత దూరానికి వెళ్లిపోయాయి. గత 24గంటల్లోనే బంగారం రూ.560  పెరగడంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.61,320 కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.56,210గా ఉంది. స్టాండర్డ్ బంగారం ధర రూ.510 వరకు పెరగడం గమనార్హం.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.61,970 కాగా, స్టాండర్డ్ బంగారం (10 గ్రాములు) రూ.56,810గా ఉంది. ఢిల్లీలో పది గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర రూ.56,360 కాగా, పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.61,470. కోల్‌కతాలో పది గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర రూ.61,470, పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.56,210 గా నమోదైంది.

బెంగళూరులో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.61,370, పది గ్రాముల స్టాండర్డ్ బంగారం రూ.56,260గా ఉంది. పాట్నాలో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.61,370 వద్ద, పది గ్రాముల స్టాండర్డ్ బంగారం రూ.56,260 వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,320, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,210గా ఉంది. అహ్మదాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం (పది గ్రాములు) ధర రూ.61,370, స్టాండర్డ్ బంగారం (పది గ్రాములు) ధర రూ.56,260గా ఉంది. జైపూర్‌లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.61,470, స్టాండర్డ్ బంగారం పది గ్రాములు రూ.56,360గా ఉంది.