బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు.. నిలకడగా వెండి.. ఇవాళ హైదరాబాద్‌లో తులం ధర ఎంత పెరిగిందంటే ?

బంగారం ధరలకు మళ్ళీ రెక్కలు.. నిలకడగా వెండి.. ఇవాళ హైదరాబాద్‌లో తులం ధర ఎంత పెరిగిందంటే ?

బంగారం ధరలు  మళ్ళి పెరిగాయి. చైనా యుఎస్ మధ్య వాణిజ్య చర్చలు, డాలర్ బలపడటం, ఇతర  సాంకేతిక అంశాలు వంటి చాల అంశాలు ప్రపంచ స్థాయిలో బంగారం ధర పెరుగుదలకు కారణమయ్యాయి.  

భారతదేశంలో దీపావళి పండగ సీజన్ కొనుగోళ్లు ముగియడం, రష్యా చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షల తర్వాత భౌగోళిక రాజకీయ అనిశ్చితులు తలెత్తడంతో రెండు రోజుల క్షీణత తర్వాత ఇవాళ ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. భారతదేశ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో  బంగారు ఫ్యూచర్స్ 2% పెరిగి 10 గ్రాములకు రూ.1,24,250 వద్ద ట్రేడవుతున్నాయి.

ధంతేరాస్  రోజున బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1.34 లక్షలకు చేరుకున్నాయి, ఇందులో GST కూడా ఉంది, ఇది గత ఏడాది తులం ధర రూ.80,469 నుండి 69 శాతం భారీగా పెరిగింది. 

ఇక 25 oct రోజున   24 క్యారెట్ల బంగారం  1గ్రామ ధర రూ.125 పెరిగి రూ.12,562 చేరగా, 22 క్యారెట్ల ధర రూ. 115 పెరిగి రూ.11,515, 18 క్యారెట్ల ధర రూ.94 ఎగిసి రూ.9,422కి పెరిగింది. 

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,25,620తో రూ.1,250 పెరిగింది. 22 క్యారెట్ల  ధర  రూ.1,150 పెరిగి రూ.1,15,150 , 18 క్యారెట్ల ధర రూ.940 పెరిగి రూ.94,220.  

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,25,620, 22 క్యారెట్ల ధర  రూ.1,15,150, 18 క్యారెట్ల ధర రూ.94,220.  

విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,25,620, 22 క్యారెట్ల ధర రూ.1,15,150, 18 క్యారెట్ల ధర రూ.94,220.  

ఇక వెండి  ధర కూడా ఇవాళ స్థిరంగా ఉంది. ప్రస్తుతం 1 లక్ష 55 వేలు ఉన్న వెండి కేజీ ధరల్లో ఇవాళ  ఎలాంటి మార్పు లేదు. దింతో వెండి గ్రాము ధర  రూ.155 ఉండగా,  కేజీ ధర రూ.1 లక్ష 55 వేలుగా ఉంది.