మరింత పెరగనున్న గోల్డ్‌ ధరలు.!

మరింత పెరగనున్న గోల్డ్‌ ధరలు.!
  • షేర్లు, డెట్‌ మార్కెట్ల కంటే బెటర్ పెర్ఫార్మెన్స్
  • ప్లాటినమ్‌ కూ ఫ్యూచర్‌ ఉంది
  • సీనియర్ ఇన్వె స్టర్‌ మార్క్‌‌ ఫేబర్

న్యూఢిల్లీ: రానున్న కొన్ని నెలల్లో షేర్లు, డెట్‌‌ మార్కెట్ల కంటే గోల్డ్‌‌ పెర్ఫార్మెన్స్‌‌ బాగుంటుందని సీనియర్‌‌‌‌ ఇన్వెస్టర్ మార్క్‌‌ ఫేబర్‌‌‌‌ అన్నారు. పాపులర్‌‌‌‌ గ్లూమ్‌‌ బూమ్‌‌ అండ్‌‌ డూమ్‌‌ రిపోర్ట్‌‌ను ఈ ఇన్వెస్టర్‌‌‌‌ రాస్తుంటారు. ఆయిల్‌‌ ధరలు, కమోడిటీల ధరలు పెరుగుతాయని 20 ఏళ్ల కిందట కరెక్ట్‌‌గా అంచనా వేసిన ఫేబర్‌‌‌‌, ప్రస్తుతం గోల్డ్‌‌పై పాజిటివ్‌‌గా ఉన్నారు. 2015 నుంచి గోల్డ్‌‌, సిల్వర్‌‌‌‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయని, ఈ ఒక్క ఏడాదే గోల్డ్‌‌ 26 శాతం, సిల్వర్‌‌‌‌ 33 శాతం(డాలర్ల పరంగా) పెరిగాయని చెప్పారు.  యూఎస్‌‌ ఫెడరల్ రిజర్వ్‌‌ కరెన్సీని విపరీతంగా ప్రింట్‌‌ చేస్తోందని, ఒక్క ఫెడ్‌‌ అనే కాకుండా గ్లోబల్‌‌ సెంట్రల్‌‌ బ్యాంకులు తమ కరెన్సీలను విపరీతంగా ముద్రిస్తున్నాయని చెప్పారు. దీంతో కరెన్సీలకు వాల్యూ పడిపోతోందని, గోల్డ్‌‌, సిల్వర్ వంటి విలువైన లోహాలకు వాల్యూ పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. చాలా సెంట్రల్‌‌ బ్యాంకులు తమ గోల్డ్‌‌ రిజర్వ్‌‌లను పెంచుకుంటున్నాయని, సమీప కాలంలో గోల్డ్‌‌ ధరలు పెరుగుతాయని చెప్పారు. వచ్చే కొన్ని నెలల్లో గోల్డ్‌‌ జ్యువలరీ ధరలు కూడా పెరుగుతాయని అంచనావేశారు. గోల్డ్‌‌తో పోలిస్తే సిల్వర్‌‌‌‌, ప్లాటినమ్‌‌ ధరలు తక్కువగా ఉన్నాయన్న ఫేబర్‌‌‌‌, భవిష్యత్‌‌లో బంగారాన్ని మించి వీటి ధరలు ఉంటాయని అంచనావేశారు.