రూ.700 పెరిగిన బంగారం ధరలు..ఇప్పుడు తులం ఎంతంటే?

రూ.700 పెరిగిన బంగారం ధరలు..ఇప్పుడు తులం ఎంతంటే?

బంగారం, వెండి కొనాలనుకునే వారికి బిగ్ షాక్. ఒక్కరోజులోనే  ధరలు భారీ మొత్తంలో పెరిగాయి.  నిన్న అంటే మార్చి 04వ తేదీ సోమవారం రోజున 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 58 వేల 750 ఉండగా..  మార్చి 5వ తేదీన ఏకంగా రూ.  700 పెరిగి రూ.  59 వేల 450కి చేరుకుంది.  ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 పెరిగి రూ.  64 వేల 90కి చేరుకుంది.  దేశంలోని వివిధ నగరాల్లో  బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చుద్దాం.  

దేశ రాజధాని ఢిల్లీలో   22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 59 వేల 600 ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64 వేల 850 గాఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 59 వేల 450 ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64 వేల 850 గాఉంది. 

హైదరాబాద్ లో  22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 59 వేల 450 ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64 వేల 850 గాఉంది. వైజాగ్, విజయవాడలో  2 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 59 వేల 450 ఉండగా,  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64 వేల 850 గాఉంది. 

ఇక వెండి ధరల విషయానికి వస్తే..  మార్చి 05న ఏకంగా కేజీ వెండిపై  రూ.  1200 పెరిగింది. దీంతో మార్కెట్ లో కేజీ వెండి ధర రూ . 78 వేల 200కు చేరకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.