భారీగా పెరిగిన బంగారం ధరలు..హైదరాబాద్లో ఎంతంటే?

భారీగా పెరిగిన బంగారం ధరలు..హైదరాబాద్లో ఎంతంటే?

అంతర్జాతీయంగా  బంగారం ధరలు పెరుగుతుండటం, ప్రస్తుతం మన దేశంలో పెళ్లిల్ల సీజన్ మొదలవడంతో బంగారు ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ మాఘమాసంలో బంగారం ధరలు పెరుగుతున్నాయంటున్నారు నిపుణులు .

ఫిబ్రవరి 19న  హైదరాబాద్ లో  బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 పెరిగడంతో రూ.62,670కి చేరింది.  అలాగే 22 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ. 250 పెరిగి రూ.57,450కి చేరింది. అలాగే సిల్వర్ ధరలు మార్కెట్లో స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి రూ. 76 వేలుగా ఉంది.

ఢిల్లీలో బంగారం ధర

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 57,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం  రూ. 62,820 గా ఉంది. 

ముంబైలో 

ముంబైలో, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ. 57,450 కాగా, అదే మొత్తంలో 24 క్యారెట్ల బంగారం విలువ రూ. 62,670.

చెన్నైలో  బంగారం ధర

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,000, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,270 గా ఉంది